ప్రపంచ దేశాలు కరోనా నుంచి ఇప్పట్లో ఊపిరి పీల్చుకునే అవకాశాలు కనిపించట్లేదు. కాలానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటున్న కరోనా... కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతోంది. ఇండియాలో సెకండ్ వేవ్ కి కారణమైన డెల్టా వేరియంట్ (Delta) ఇప్పుడు విదేశాల్లో విజృంభిస్తోంది. 96 దేశాల్లో ఇది విస్తరించింది. అటు దక్షిణ అమెరికా, లాటిన్ ఆమెరికా దేశాల్లో లాంబ్డా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల ప్రపంచ దేశాలు కరోనా పోయింది అనుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని హెచ్చరించింది. (image credit - twitter - reuters)
ఒకే డోసుగా ఇచ్చే స్పు్త్నిక్ లైట్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇందుకు సంబంధించి డాక్టర్ రెడ్డీస్ ఇచ్చిన ట్రయల్స్ రిపోర్టుకి శాస్త్రీయ హేతుబద్ధత లేదని వ్యాక్సిన్లపై కేంద్రం ఏర్పాటు చేసిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ (SEC) తెలిపింది. (image credit - twitter - reuters)
కోవిషీల్డ్, కోవాగ్జిన్ వేసుకున్న భారతీయులను అనుమతించేందుకు ఏడు యూరోపియన్ యూనియన్ (EU) దేశాలు అంగీకరించాయి. ఇలా అంగీకరించకపోతే... యూరప్ నుంచి భారత్ వచ్చే వారికి క్వారంటైన్ అమలు చేస్తామని భారత ప్రభుత్వం హెచ్చరించడంతో... ఈయూ దేశాలు దిగి వచ్చాయి. మిగతా దేశాలు కూడా ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. (image credit - twitter - reuters)
గర్భిణులు కూడా నేరుగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అని కేంద్రం స్పష్టం చేసింది. ఐతే... ఇది తప్పనిసరి కాదు. వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అనేది గర్భిణుల నిర్ణయానికే వదిలేసింది. గర్భిణులు వ్యాక్సిన్ వేయించుకున్నా సమస్య ఉండదని ఆరోగ్య రంగ నిపుణుల శాస్త్రీయ అధ్యయనంలో తేలడంతో కేంద్రం అంగీకరించింది. (image credit - twitter)
ఇండియాలో మొత్తం రికవరీల సంఖ్య 2,95,48,302కి చేరింది. రికవరీ రేటు 97.01 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 5,09,637 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 18,80,026 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 41 కోట్ల 42 లక్షల 51 వేల 520 టెస్టులు చేశారు. కొత్తగా 42.60 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 34 కోట్ల 00 లక్షల 76 వేల 232 వ్యాక్సిన్లు వేశారు. (image credit - twitter - reuters)
AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 93,759 టెస్టులు చెయ్యగా... కొత్తగా 3,464 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,96,818కి చేరింది. కొత్తగా 35 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,779కి చేరింది. కొత్తగా 4,284 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 18,46,716కి చేరింది. ప్రస్తుతం 37,323 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,21,77,951 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 858 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,25,237కి చేరాయి. కొత్తగా 1,175 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,08,833కి చేరింది. రికవరీ రేటు 97.37 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 9 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,678కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,726 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 4,27,931 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18.38 కోట్లు దాటింది. కొత్తగా 8,104 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 39.79 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.15 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 16,717 కేసులు, 312 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 65,165 కొత్త కేసులు... 1,879 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు బ్రెజిల్లో వస్తుంటే... ఆ తర్వాత ఇండియా, కొలంబియా, బ్రిటన్, ఇండొనేసియా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంటే... ఆ తర్వాత ఇండియా, రష్యా, అర్జెంటినా, కొలంబియా ఉన్నాయి. (image credit - twitter - reuters)