INDIA COVID UPDATES INDIA REPORTS 2527 NEW COVID CASES AND 33 DEATHS IN LAST 24 HOURS DETAILS HERE MKS
India covid: నిర్లక్ష్యానికి భారీ మూల్యం.. కొత్తగా 2527 కరోనా కేసులు.. 33 మరణాలు..
కరోనా వైరస్ మహమ్మారి పట్ల ప్రభుత్వాలు, ప్రజల్లో నెలకొన్న అలసత్వం భారీ మూల్యానికి దారితీయబోతున్నదా? అంటే గణాంకాలు అవుననే అంటున్నాయి. వరుసగా 3వ రోజూ రెండు వేల పైచిలకు కొత్త కేసులు నమోదు కావడం, మరణాల సంఖ్య భారీగా ఉండటం కలవరపెడుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించిన వివరాలివి..
దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. శనివారం నాటికి వరుసగా మూడురోజులపాటు కొత్త కేసుల సంఖ్య రెండు వేలకుపైగానే ఉంది. మరణాలూ భారీగానే నమోదవుతున్నాయి. జూన్ నాటికి నాలుగో వేవ్ తప్పదన్న హెచ్చరికల నేపథ్యంలో తాజా పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్నది.
2/ 7
కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ లోని వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొవిడ్ టెస్టులు చేయగా, కొత్తగా 2,527 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
3/ 7
కొత్తగా నమోదవుతోన్న కేసుల్లో దేశ రాజధాని ఢిల్లీ, నుంచే ఎక్కువగా వస్తున్నాయి. నిన్న ఒక్కరోజే ఢిల్లీలో 1,042 కేసులు వచ్చాయి. ఇక్కడ కొత్త కేసులు వెయ్యికిపైగా నమోదు కావడం వరుసగా రెండోజు.
4/ 7
నిన్న ఒక్కరోజే కరోనా కాటుకు 33 మంది బలయ్యారు. ఇందులో కేరళలో సంభవించిన మరణాలు 31కాగా, ఢిల్లీలో ఇద్దరు చనిపోయారు. ఇప్పటివరకూ 5.22 లక్షల మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.
5/ 7
గడిచిన 24 గంటల్లో కొవిడ్ వ్యాధి నుంచి 1656 మంది కోలుకున్నారు. కొంతకాలంగా రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా వస్తుండటంతో రికవరీ రేటు 98.75 శాతానికి తగ్గింది.
6/ 7
కొత్త కేసులు భారీగా, రికవరీలు సాధారణంగా ఉండటంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసులు గణనీయంగా పెరుకుపోతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 15,079కి చేరుకున్నాయి. యాక్టివిటీ రేటు 0.04 శాతానికి పెరిగింది.
7/ 7
దేశంలో కవిడ్ టీకాల పంపిణీ కొనసాగుతున్నది. నిన్న 19.13 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకూ 187 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసులు ఎక్కువగా వస్తోన్న రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు చేసింది.