ఇండియాలో మరో వ్యాక్సిన్‌కి అనుమతి లభించింది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి DCGI అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను సిప్లా ఫార్మా కంపెనీ దిగుమతి చేస్తుంది. ఇది కరోనాపై 90 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలింది. ఇండియాలో కరోనా వైరస్ కోసం అత్యవసర అనుమతి పొందిన నాలుగో వ్యాక్సిన్‌గా మోడెర్నా నిలిచింది. ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ విలకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. (image credit - twitter)
గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వారు కూడా వ్యాక్సిన్లు తీసుకోవచ్చని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. వ్యాక్సిన్ వారికి కూడా సురక్షితమే అన్నారు. వాటిని తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదని స్పష్టం చేశారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి, మోడెర్నా... ఈ 4 వ్యాక్సిన్లూ పాలిచ్చే తల్లులకు, గర్భిణీలకు సేఫ్ అని తెలిసిందని వీకే పాల్ స్పష్టం చేశారు. (image credit - twitter - reuters)
ఇండియాలో సెకండ్ వేవ్‌కి కారణమైన డెల్టా వేరియంట్... ఇప్పుడు ఆస్ట్రేలియాలో జోరుగా ఉంది. అక్కడి సిడ్నీలో ఒక్క రోజులో 150 కేసులు రావడంతో... ఇక లాభం లేదనుకున్న ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. పశ్చిమ ఆస్ట్రేలియా రాజధాని పెర్త్ తోపాటూ... డార్విన్, క్వీన్స్ ల్యాండ్ లో 4 రోజులపాటూ పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది. (image credit - twitter - reuters)
India Covid: ఇండియాలో కొత్తగా 37,566 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,03,16,897కి చేరింది. కొత్తగా 907 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 3,97,637కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.17 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 56,994 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,93,66,601కి చేరింది. రికవరీ రేటు 96.9 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 5,52,659 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,68,008 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 40 కోట్ల 81 లక్షల 39 వేల 287 టెస్టులు చేశారు. కొత్తగా 52,76,457 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 32 కోట్ల 90 లక్షల 29 వేల 510 వ్యాక్సిన్లు వేశారు. (image credit - NIAID)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 987 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,22,593కి చేరాయి. కొత్తగా 1,362 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,05,455కి చేరింది. రికవరీ రేటు 97.24 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 7గురు మరణించారు. మొత్తం మరణాలు 3,651కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,487 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 91,231 టెస్టులు చెయ్యగా... కొత్తగా 3,620 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,85,716కి చేరింది. కొత్తగా 41 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,671కి చేరింది. కొత్తగా 5,757 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 18,32,971కి చేరింది. ప్రస్తుతం 40,074 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,18,95,922 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 3,63,589 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18.25 కోట్లు దాటింది. కొత్తగా 7,386 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 39.53 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.14 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 9,898 కేసులు, 257 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 64,903 కొత్త కేసులు... 1,917 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు బ్రెజిల్లో వస్తుంటే... ఆ తర్వాత ఇండియా, కొలంబియా, అర్జెంటినా, రష్యా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంటే... ఆ తర్వాత ఇండియా, రష్యా, కొలంబియా, అర్జెంటినా ఉన్నాయి. (image credit - twitter - reuters)