ఇండియాలో డెల్టా, డెల్టా ప్లస్ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. వీటి వల్లే వ్యాక్సిన్లు వేసుకున్న వారికి కూడా కరోనా సోకుతోంది. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కొత్త రూల్స్ జారీ చేసింది. షాపులను సాయంత్రం 4 గంటల వరకే ఓపెన్ చెయ్యాలని చెప్పింది. ఆ తర్వాత ఆ రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతుంది. ఇవాళ్టి నుంచే ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. (image credit - twitter)
డెల్టా ప్లస్ వేరియంట్‌ని తక్కువ అంచనా వెయ్యొద్దని నిపుణులు చెబుతున్నారు. డెల్టాతో ఇండియా ఎంతలా ఇబ్బంది పడిందో ప్రత్యక్షంగా చూశాం కాబట్టి.. అంతకంటే శక్తిమంతంగా ఉన్న డెల్టా ప్లస్ వేరియంట్‌తో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వద్దంటున్నారు. మాస్కులు, సేఫ్ డిస్టాన్స్, శానిటైజర్... ఈ మూడూ కచ్చితంగా పాటిస్తేనే... డెల్టా ప్లస్‌కి దొరకకుండా తప్పించుకోగలం అని చెబుతున్నారు. ప్రధానంగా డెల్టా ప్లస్ ఊపిరి తిత్తులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. కాబట్టి... ఇది గానీ సోకితే... పేషెంట్‌ని కాపాడేలోపే చనిపోయే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. (image credit - twitter)
ప్రపంచంలోని 85 దేశాల్లో డెల్టా వేరియంట్ విస్తరించింది. ఇండియాలో సెకండ్ వేవ్‌కి కారణమైనది ఈ వేరియంటే అంటున్నారు. ఇప్పుడు ఇండియాలో తగ్గుతూ... విదేశాల్లో ఇది పెరుగుతోంది. అయితేనేం.. ఇండియాలో దీన్ని మించిన డెల్టా ప్లస్ ఉండనే ఉంది. అందువల్ల ప్రస్తుతం కరోనా ముప్పు తొలగనట్లే అనుకోవాల్సి ఉంటుంది. డెల్టా ప్లస్ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా అనే డౌట్ ఉంది. త్వరగా వ్యాక్సినేషన్ పూర్తైతే తప్ప... కరోనా నుంచి భారత్ బయటపడే అవకాశాలు ఉండవు అంటున్నారు నిపుణులు. (image credit - twitter)
India Covid: ఇండియాలో కొత్తగా 50,040 వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కి చేరింది. కొత్తగా 1258 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 3,95,751కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.17 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 57,944 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,92,51,029కి చేరింది. రికవరీ రేటు 96.8 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 5,86,403 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.94 శాతం ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,77,309 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 40 కోట్ల 42 లక్షల 65 వేల 101 టెస్టులు చేశారు. కొత్తగా 64,25,893 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 32 కోట్ల 17 లక్షల 60 వేల 077 వ్యాక్సిన్లు వేశారు. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 7488 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,20,613కి చేరాయి. కొత్తగా 1,492 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,02,676కి చేరింది. రికవరీ రేటు 97.10 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 8 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,635కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,302 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 95,327 టెస్టులు చెయ్యగా... కొత్తగా 4,250 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,79,872కి చేరింది. కొత్తగా 33 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,599కి చేరింది. కొత్తగా 5,570 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 18,22,500కి చేరింది. ప్రస్తుతం 44,773 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,17,32,933 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 2,54,676 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18.17 కోట్లు దాటింది. కొత్తగా 4,661 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 39.37 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.15 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 4,061 కేసులు, 92 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 33,704 కొత్త కేసులు... 655 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు బ్రెజిల్, ఇండియాలో వస్తుంటే... ఆ తర్వాత ఇండొనేసియా, రష్యా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్, ఇండియా మొదటి స్థానంలో ఉంటుంటే... ఆ తర్వాత రష్యా, ఇండొనేసియా, మెక్సికో ఉన్నాయి. (image credit - twitter - reuters)