ఇండియాలో కొత్తగా 35,840 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,18,88,642కి చేరింది. రికవరీ రేటు 97.5 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్లో 3,68,558 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,55,327 టెస్టులు చేశారు. భారత్లో ఇప్పటివరకు 51 కోట్ల 86 లక్షల 42 వేల 929 టెస్టులు చేశారు. కొత్తగా 73,85,866 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 63 కోట్ల 09 లక్షల 17 వేల 927 వ్యాక్సిన్లు వేశారు. (image credit - twitter - reuters)
ఇండియాలో యాక్టివ్ కేసులు 24 గంటల్లో 8.78వేలు పెరిగాయి. ఇవి వరుసగా ఐదో రోజు పెరిగాయి. అలాగే.. కొత్త కేసులు వరుసగా 4వ రోజున 40వేలకు పైగా వచ్చాయి. మరణాలు వరుసగా ఐదో రోజు 400కు పైగా వచ్చాయి. నిన్న దేశంలోనే ఎక్కువగా కేరళలో కొత్త కేసులు 31.27వేలు రాగా... ఆ తర్వాత మహారాష్ట్రలో 4.8వేలు, తమిళనాడులో 1.55వేలు వచ్చాయి. నిన్న దేశంలోనే ఎక్కువగా కేరళలో 153 కొత్త మరణాలు రాగా... ఆ తర్వాత మహారాష్ట్రలో 126, ఒడిశాలో 68 కరోనాతో చనిపోయారు. 89 రోజుల తర్వాత మళ్లీ కేరళలో యాక్టివ్ కేసులు 2 లక్షలకు పైగా ఉన్నాయి. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో కేరళవి 55.74 శాతం ఉన్నాయి. దేశంలోని మొత్తం కొత్త కేసుల్లో కేరళవి 69.35 శాతం ఉన్నాయి. ప్రస్తుతం 10 రాష్ట్రాలు లేదా కేంద్రపాలితాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. గత వారం కంటే ఈ వారం కొత్త కేసులు 17 శాతం పెరిగాయి. ప్రపంచదేశాల్లో అవి 2 శాతం తగ్గాయి. ఇండియాలో టెస్టుల పాజిటివిటీ రేటు 64వ రోజు 3 శాతం కంటే తక్కువ వచ్చింది. వారపు లెక్కలో చూస్తే కేరళలో పాజిటివిటీ రేటు 18.21 శాతం ఉండగా... మణిపూర్లో 10.47 శాతం, మిజోరంలో 9 శాతం ఉంది. (image credit - twitter - reuters)
AP Covid: ఏపీలో కొత్తగా 64,461 టెస్టులు చెయ్యగా... కొత్తగా 1,321 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20,10,566కి చేరింది. కొత్తగా 19 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,807కి చేరింది. కొత్తగా 1,499 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,81,906కి చేరింది. ప్రస్తుతం 14,853 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,64,71,272 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 325 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,57,119కి చేరాయి. కొత్తగా 424 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,47,185కి చేరింది. రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా ఇద్దరు మరణించారు. మొత్తం మరణాలు 3,869కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,065 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 5,11,721 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 21.66 కోట్లు దాటింది. కొత్తగా 8,464 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 45.06 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.85 కోట్లు ఉన్నాయి. ఇవి మరింత పెరిగాయి. అమెరికాలో కొత్తగా 47,165 కేసులు, 589 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో నిన్న 24,699 కొత్త కేసులు, 614 మరణాలు సంభవించాయి. (image credit - twitter - reuters)