Covid 19 Updates: ఇండియాలో కొత్తగా 60,471 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,95,70,881కి చేరింది. కొత్తగా 2,726 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,77,031కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.16 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 1,17,525 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,82,80,472కి చేరింది. రికవరీ రేటు కొద్దిగా పెరిగి 95.6కి చేరింది. ప్రస్తుతం భారత్లో 9,13,378 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,51,358 టెస్టులు చేశారు. భారత్లో ఇప్పటివరకు 38 కోట్ల 13 లక్షల 75 వేల 984 టెస్టులు చేశారు. కొత్తగా 39,27,154 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 38 కోట్ల 13 లక్షల 75 వేల 984 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. (image credit - NIAID)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 1,511 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,04,880కి చేరాయి. కొత్తగా 2,175 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 5,80,923కి చేరింది. రికవరీ రేటు 95.39 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 12 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,496కి చేరాయి. మరణాల రేటు 0.57 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,461 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్లో తాజాగా 87,756 టెస్టులు చెయ్యగా... కొత్తగా 4,549 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,14,393కి చేరింది. కొత్తగా 59 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 11,999కి చేరింది. కొత్తగా 10,114 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 17,22,381కి చేరింది. ప్రస్తుతం 80,013 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,05,38,738 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 2,95,024 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 17.70 కోట్లు దాటింది. కొత్తగా 6,299 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 38.27 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.19 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 9,301 కేసులు, 191 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 40,865 కొత్త కేసులు... 928 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు ఇండియా లేదా బ్రెజిల్లో వస్తుంటే... ఆ తర్వాత కొలంబియా, అర్జెంటినా, రష్యా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉండగా... ఆ తర్వాత బ్రెజిల్, అర్జెంటినా, కొలంబియా, రష్యా ఉన్నాయి. (image credit - twitter - reuters)