ఈ ప్రపంచం కరోనాకి ముందు... కరోనాకి తర్వాత అన్నట్లు తయారైంది. 2019లో వచ్చిన వైరస్... ఇంకా వదలట్లేదు. ఇది ఎలా ఎన్నాళ్లు మనుషుల్ని పట్టుకుంటుంది అనేది కచ్చితంగా తెలియట్లేదు. వ్యాక్సిన్లు, బాస్టర్ డోసుల వంటివి వస్తున్నా... వైరస్ జోరు తగ్గట్లేదు. పైగా రూపాలు మార్చుకొని మరీ మానవాళిపై దండయాత్ర చేస్తోంది. ఇండియాలో సెకండ్ వేవ్ తగ్గిందే కానీ... పూర్తిగా తగ్గలేదు. రోజూ 40 వేల దాకా కేసులు వస్తూనే ఉన్నాయి. ఓవైపు వ్యాక్సిన్లు వేస్తున్నా... వైరస్ పూర్తిగా తగ్గకపోవడం ఆందోళనకర అంశం. పైగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఇండియాలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. తాజా కేసులు, మరణాలెన్నో తెలుసుకుందాం. (image credit - NIAID)
ఇండియాలో కొత్తగా... 57,477 మంది రికవరీ అవ్వగా... మొత్తం రికవరీల సంఖ్య 2,96,05,779కి చేరింది. రికవరీ రేటు 97.1 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్లో 4,95,533 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 18,76,036 టెస్టులు చేశారు. భారత్లో ఇప్పటివరకు 41 కోట్ల 64 లక్షల 16 వేల 463 టెస్టులు చేశారు. కొత్తగా 43,99,298 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 34 కోట్ల 46 లక్షల 11 వేల 291 వ్యాక్సిన్లు వేశారు. (image credit - twitter - reuters)
AP Covid: ఆంధ్రప్రదేశ్లో తాజాగా 93,759 టెస్టులు చెయ్యగా... కొత్తగా 3,464 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,96,818కి చేరింది. కొత్తగా 35 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,779కి చేరింది. కొత్తగా 4,284 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 18,46,716కి చేరింది. ప్రస్తుతం 37,323 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,21,77,951 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 858 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,25,237కి చేరాయి. కొత్తగా 1,175 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,08,833కి చేరింది. రికవరీ రేటు 97.37 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 9 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,678కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,726 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 4,27,931 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18.38 కోట్లు దాటింది. కొత్తగా 8,104 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 39.79 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.15 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 16,717 కేసులు, 312 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 65,165 కొత్త కేసులు... 1,879 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు బ్రెజిల్లో వస్తుంటే... ఆ తర్వాత ఇండియా, కొలంబియా, బ్రిటన్, ఇండొనేసియా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంటే... ఆ తర్వాత ఇండియా, రష్యా, అర్జెంటినా, కొలంబియా ఉన్నాయి. (image credit - twitter - reuters)