ఇండియాలో థర్డ్ వేవ్ వస్తే అదేమంత ప్రమాదకరంగా ఉండదనీ... దానిపై అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదని కొందరు నిపుణులు అంటున్నారు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. సెకండ్ వేవ్ నానాటికీ తగ్గిపోతోంది. అలాగే... దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం అంతకంతకూ జోరందుకుంటోంది. యువత కూడా వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. అందువల్ల థర్డ్ వేవ్ వచ్చినా... దాని ప్రభావం తక్కువే ఉంటుంది అంటున్నారు. పిల్లలపై ప్రభావం చూపుతుంది అనేందుకు కూడా కచ్చితమైన ఆధారాలు లేవని చెబుతున్నారు. మాస్క్, సేఫ్ డిస్టాన్స్ లాంటి జాగ్రత్తలు మాత్రం అందరూ పాటించాలని చెబుతున్నారు. (image credit - NIAID)
India Covid: ఇండియాలో మొన్న 46,148 కరోనా పాజిటివ్ కేసులు రాగా... నిన్న 37,566 వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,03,16,897కి చేరింది. మొన్న 979 మంది చనిపోగా... నిన్న 907 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 3,97,637కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.17 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 56,994 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,93,66,601కి చేరింది. రికవరీ రేటు 96.9 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్లో 5,52,659 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,68,008 టెస్టులు చేశారు. భారత్లో ఇప్పటివరకు 40 కోట్ల 81 లక్షల 39 వేల 287 టెస్టులు చేశారు. కొత్తగా 52,76,457 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 32 కోట్ల 90 లక్షల 29 వేల 510 వ్యాక్సిన్లు వేశారు. (image credit - twitter)
ఇండియాలో యాక్టివ్ కేసులు 24 గంటల్లో 20.34వేలు తగ్గాయి. అలాగే కొత్త కేసులు 103 రోజుల కనిష్టానికి తగ్గాయి. అలాగే... 102 రోజుల తర్వాత మళ్లీ 40 వేల కంటే తక్కువగా నమోదయ్యాయి. అలాగే మరణాలు కూడా 77 రోజుల కనిష్టానికి తగ్గాయి. అలాగే మరణాలు వరుసగా రెండో రోజు వెయ్యి కంటే తక్కువ నమోదయ్యాయి. అలాగే కొత్త కేసులు వరుసగా రెండో రోజు 50వేల కంటే తక్కువగా వచ్చాయి. కర్ణాటక, కేరళలో... యాక్టివ్ కేసులు లక్ష కంటే తక్కువకు చేరాయి. మహారాష్ట్రలో మాత్రమే ప్రస్తుతం లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే... నిన్న దేశంలోనే అత్యధికంగా కేరళలో 8.06 వేల కొత్త కేసులు, మహారాష్ట్రలో 6.73 వేల కేసులు, తమిళనాడులో 4.8వేల కేసులు వచ్చాయి. ఇక దేశంలోనే మహారాష్ట్రలో నిన్న అత్యధికంగా 287 మంది చనిపోగా.. ఆ తర్వాత కేరళలో 110 మంది, తమిళనాడులో 98 మంది చనిపోయారు. ప్రస్తుతం 4 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. టెస్టులు 23వ రోజు 20 లక్షల కంటే తక్కువ జరిగాయి. టెస్టుల పాజిటివిటీ రేటు వరుసగా 8వ రోజు 3 శాతం కంటే తక్కువ ఉంది. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 993 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,21,606కి చేరాయి. కొత్తగా 1,417 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,04,093కి చేరింది. రికవరీ రేటు 97.18 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 9 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,644కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,869 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్లో తాజాగా 71,758 టెస్టులు చెయ్యగా... కొత్తగా 2,224 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,82,096కి చేరింది. కొత్తగా 31 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,630కి చేరింది. కొత్తగా 4,714 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 18,27,214కి చేరింది. ప్రస్తుతం 42,252 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,18,04,691 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 3,06,790 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18.21 కోట్లు దాటింది. కొత్తగా 5,741 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 39.44 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.14 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 9,118 కేసులు, 116 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 27,804 కొత్త కేసులు... 907 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు ఇండియాలో వస్తుంటే... ఆ తర్వాత కొలంబియా, బ్రెజిల్, బ్రిటన్, రష్యా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంటే... ఆ తర్వాత బ్రెజిల్, కొలంబియా, రష్యా, అర్జెంటినా ఉన్నాయి. (image credit - twitter - reuters)