ఓవైపు దేశంలో డెల్టా ప్లస్ కేసులు పెరిగిపోతుంటే... ఏం కాదు... పెద్దగా ప్రమాదం లేదని కొందరు నిపుణులు సింపుల్గా చెప్పేస్తున్నారు. సెకండ్ వేవ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే లైట్ తీసుకున్నారు. అది చాలా మందిని పట్టుకుపోయింది. డెల్టా ప్లస్ దాని కంటే వేగంగా వ్యాపిస్తోందని చెప్పే నిపుణులు... ఏం పర్లేదు అని ఎలా అంటారన్నది ప్రశ్న. రోజురోజుకూ ఇతర రాష్ట్రాలకు ఈ కొత్త వేరియంట్ దూసుకుపోతోంది. తమిళనాడులో ఓ వ్యక్తి తాజాగా చనిపోయారు. దీంతో డెల్టా ప్లస్ మరణాలు 3కి చేరాయి. (image credit - twitter)
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 4 రకాల వేరియంట్లు భయపెడుతున్నాయి. అవి ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. వీటికి డెల్టా ప్లస్ తోడైంది. ఇది ఇండియాలో జోరుగా ఉంది. ఇండియాలో సెకండ్వేవ్కి కారణమైన డెల్టా వేరియంట్... ఇప్పుడు అమెరికా, యూరప్, ఆసియా, దక్షిణ అమెరికాల్లో వ్యాపిస్తోంది. ఐతే... ప్రస్తుతం అన్ని వేరియంట్ల కంటే ప్రమాదకరంగా డెల్టా, డెల్టా ప్లస్ మాత్రమే ఉన్నాయి. (image credit - twitter - reuters)
మహారాష్ట్రలో మళ్లీ కఠిన ఆంక్షలు పెడుతున్నారు. ఈమధ్యే లాక్డౌన్ నుంచి బయటపడిన ఆ రాష్ట్రంలో డెల్టా ప్లస్ కరోనా వైరస్ కేసులు వస్తుండటంతో... ఆంక్షలను ప్రభుత్వం పెంచింది. అన్ని జిల్లాల్లో లెవెల్ 3 ఆంక్షల్ని అమలుచేస్తోంది. మహారాష్ట్ర నుంచి డెల్టా ప్లస్ వేరియంట్... సోకకుండా తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సరిహద్దు జిల్లాల్లో అలర్ట్ జారీ అయ్యింది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా ప్రజల్లో ఒకింత టెన్షన్ ఉంది. అక్కడ కరోనా టెస్టుల సంఖ్యను అధికారులు పెంచారు. సరిహద్దుల్లో తనిఖీలు కూడా పెరిగాయి. (image credit - twitter)
వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో ఎక్కువగా యువతకు జ్వరం, అలసట బాగా వస్తోంది. 45 ఏళ్లు దాటిన వారిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. ఐతే... డాక్టర్లు మాత్రం జ్వరం రావడమే మంచిది అంటున్నారు. జ్వరం వచ్చిదంటే దాని అర్థం యాంటీబాడీలు పెరుగుతున్నట్లు లెక్క అంటున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నాక... కొన్ని రోజులపాటూ ప్రశాంతంగా ఉండాలనీ... పెద్ద పనులు ఏవీ చెయ్యవద్దని కోరుతున్నారు. కఠినమైన ఎక్సర్సైజులు కూడా చెయ్యవద్దంటున్నారు. (image credit - twitter)
India Covid: ఇండియాలో కొత్తగా 48,689 వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,01,83,143కి చేరింది. కొత్తగా 1,183 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,94,493కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.17 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 64,818 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,91,93,085కి చేరింది. రికవరీ రేటు 96.7 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్లో 5,95,565 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,45,809 టెస్టులు చేశారు. భారత్లో ఇప్పటివరకు 40 కోట్ల 13 లక్షల 14 వేల 257 టెస్టులు చేశారు. కొత్తగా 61,19,169 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 31 కోట్ల 50 లక్షల 45 వేల 926 వ్యాక్సిన్లు వేశారు. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 1,028 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,19,865కి చేరాయి. కొత్తగా 1,489 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,01,184కి చేరింది. రికవరీ రేటు 96.98 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 9 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,627కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,054 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్లో తాజాగా 96,121 టెస్టులు చెయ్యగా... కొత్తగా 4,147 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,75,622కి చేరింది. కొత్తగా 38 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,566కి చేరింది. కొత్తగా 5,773 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 18,16,930కి చేరింది. ప్రస్తుతం 46,126 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,16,37,606 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 3,61,314 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18.15 కోట్లు దాటింది. కొత్తగా 7,208 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 39.32 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.15 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 5,718 కేసులు, 147 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 64,134 కొత్త కేసులు... 1,547 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు బ్రెజిల్లో వస్తుంటే... ఆ తర్వాత ఇండియా, కొలంబియా, రష్యా, ఇండొనేసియా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంటుంటే... ఆ తర్వాత ఇండియా, కొలంబియా, రష్యా, ఇండొనేసియా ఉన్నాయి. (image credit - twitter - reuters)