ఇప్పటివరకూ కోవాగ్జిన్ (covaxin) టీకా వేసుకున్న వారిని యూరప్, గల్ఫ్ దేశాలు తమ గడ్డపై అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటుంటే... తాజాగా ఇండియాలో తయారవుతున్న కోవిషీల్ట్ విషయంలోనూ అదే జరుగుతోంది. కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు... కోవిషీల్డ్ (covishield) వ్యాక్సిన్‌ను తమ లిస్ట్ నుంచి తొలగించాయి. ఆ వ్యాక్సిన్ వేసుకున్నవారిని తమ దేశంలోకి అనుమతించట్లేదు. దీనిపై భారత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి కోవిషీల్డ్‌ను తయారుచేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అధార్ పూనవల్లా కోరారు. కోవిషీల్డ్‌కి ఆల్రెడీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తింపు ఉంది. (image credit - twitter - reuters)
వ్యాక్సిన్లు వెయ్యడంలో ఇండియా... అమెరికాను దాటేసింది. ఇప్పటివరకూ ఇండియా... 32కోట్ల 36 లక్షల డోసుల వ్యాక్సిన్ (vaccine) వెయ్యగా... అమెరికా... 32 కోట్ల 33 లక్షల డోసులు వేసింది. ఇందుకోసం అమెరికా 6 నెలల టైమ్ తీసుకోగా... ఇండియా 5 నెలల్లోనే పూర్తి చేసింది. జనవరి 16 నుంచి ఇండియాలో వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఈమధ్య ఒకే రోజు 86 లక్షల టీకాలు వేసి... అత్యధిక టీకాలు ఒకే రోజు వేసిన రికార్డు కూడా ఇండియా సొంతం చేసుకుంది. ప్రస్తుతం దేశ ప్రజలకు ఉచితంగానే కేంద్రం టీకాలు అందిస్తోంది. (image credit - twitter)
డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (Dr. Reddys) తయారుచేస్తున్న 2డీజీ పొడి మందును సోమవారం మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీన్ని నీళ్లలో కలుపుకొని తాగుతారు. ఇది కూడా కరోనాపై బాగా పనిచేస్తోందని ప్రయోగాల్లో తేలింది. ఒక ప్యాకెట్ ధరను రూ.990గా రెడ్డీస్ డిసైడ్ చేసింది. దీన్ని ముందుగా మెట్రో నగరాలు, పెద్ద నగరాలకు సప్లై చేస్తామని తెలిపింది. ఈ కారణంగా సోమవారం రెడ్డీస్ షేర్ల విలువ స్టాక్మార్కెట్లో పెరిగింది. (image credit - twitter - ANI)
బ్రిటన్ లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బాగా పెరగడంతో... ఆ దేశాన్ని అత్యధిక ప్రమాదకర కేటగిరీలో పెట్టుకున్నాయి చాలా దేశాలు. వచ్చే మూడు వారాల్లో ఈ కేసులు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరణాలు కూడా పెరుగుతుండడం ఆందోళనను పెంచుతోంది. తాజాగా బ్రిటన్ విమానాల రాకపై హాంకాంగ్ నిషేధం విధించింది. దీని ప్రకారం బ్రిటన్ లో కనీసం రెండు గంటలకు మించి ఉన్నవారికి హాంకాంగ్‌లోకి ప్రస్తుతానికి ప్రవేశం ఉండదు. బ్రిటన్ నుంచి విమానాల రాకను హాంకాంగ్ నిషేధించడం ఇది రెండోసారి. (image credit - twitter - reuters)
India Covid: ఇండియాలో మొన్న 50,040 కరోనా పాజిటివ్ కేసులు రాగా... నిన్న 46,148 వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,02,79,331కి చేరింది. మొన్న 1258 మంది చనిపోగా... నిన్న 979 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 3,96,730కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.17 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 58,578 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,93,09,607కి చేరింది. రికవరీ రేటు 96.8 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 5,72,994 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 15,70,515 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 40 కోట్ల 63 లక్షల 71 వేల 279 టెస్టులు చేశారు. కొత్తగా 17,21,268 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 32 కోట్ల 36 లక్షల 63 వేల 297 వ్యాక్సిన్లు వేశారు. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 993 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,21,606కి చేరాయి. కొత్తగా 1,417 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,04,093కి చేరింది. రికవరీ రేటు 97.18 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 9 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,644కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,869 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 71,758 టెస్టులు చెయ్యగా... కొత్తగా 2,224 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,82,096కి చేరింది. కొత్తగా 31 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,630కి చేరింది. కొత్తగా 4,714 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 18,27,214కి చేరింది. ప్రస్తుతం 42,252 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,18,04,691 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 3,06,790 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18.21 కోట్లు దాటింది. కొత్తగా 5,741 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 39.44 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.14 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 9,118 కేసులు, 116 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 27,804 కొత్త కేసులు... 907 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు ఇండియాలో వస్తుంటే... ఆ తర్వాత కొలంబియా, బ్రెజిల్, బ్రిటన్, రష్యా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంటే... ఆ తర్వాత బ్రెజిల్, కొలంబియా, రష్యా, అర్జెంటినా ఉన్నాయి. (image credit - twitter - reuters)