India Covid: ఇండియాలో మొన్న కొత్తగా 51,667 కరోనా పాజిటివ్ కేసులు రాగా నిన్న... 48,689 వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,01,83,143కి చేరింది. మొన్న కొత్తగా 1,329 మంది చనిపోగా... నిన్న 1,183 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,94,493కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.17 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 64,818 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,91,93,085కి చేరింది. రికవరీ రేటు 96.7 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 5,95,565 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,45,809 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 40 కోట్ల 13 లక్షల 14 వేల 257 టెస్టులు చేశారు. కొత్తగా 61,19,169 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 31 కోట్ల 50 లక్షల 45 వేల 926 వ్యాక్సిన్లు వేశారు. (image credit - NIAID)
యాక్టివ్ కేసులు 17.3వేలు తగ్గాయి. 86 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు 6 లక్షల కంటే తక్కువ వచ్చాయి. మరణాలు వరుసగా ఆరో రోజు 1500 కంటే తక్కువగా నమోదయ్యాయి. అలాగే కొత్త కేసులు వరుసగా 7వ రోజు 60వేల కంటే తక్కువ వచ్చాయి. ఇక దేశంలో ప్రస్తుతం కేరళలో అత్యధికంగా నిన్న 11.5వేల కొత్త కేసులు వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 9.6వేలు, తమిళనాడులో 5.8వేల కేసులు వచ్చాయి. ఇక మరణాలు చూస్తే... దేశంలోనే అత్యధికంగా నిన్న మహారాష్ట్రలో 511 మంది చనిపోగా... తమిళనాడులో 150 మంది, కేరళలో 118 మంది చనిపోయారు. ప్రస్తుతం కేరళ, మేఘాలయలో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 7 రోజులకూ, అంతకు ముందు 7 రోజులకూ మధ్య కొత్త కేసులు 23 శాతం తగ్గాయి. ప్రపంచ దేశాల్లో 0.6 శాతం పెరిగాయి. (image credit - twitter - reuters)
ఇండియాలో డెల్టా ప్లస్ వైరస్ ఇప్పుడిప్పుడే దూసుకొస్తోంది. దీని వల్ల ఇప్పటికే మహారాష్ట్రలో ఒకరు, మధ్యప్రదేశ్‌లో మరొకరు చనిపోయారు. దేశంలో డెల్టా ప్లస్ 11 రాష్ట్రాల్లో విస్తరించింది. ఇప్పటివరకూ 52 కేసుల్ని గుర్తించారు. వాటిలో ఒకటి ఏపీలో నమోదైంది. డెల్టా వేరియంట్ రూపాంతరం చెంది... డెల్టా ప్లస్ వేరియంట్‌గా మారింది. ఇది మరింత ఎక్కువగా వ్యాపిస్తోంది. ఇది సోకిన వ్యక్తి తుమ్మినా, తుమ్మకపోయినా... ఆ వ్యక్తి పక్క నుంచి మాస్క్ లేకుండా వెళ్తే... కచ్చితంగా ఇది సోకేస్తోంది. అంత వేగంగా సోకడానికి కారణం దానిలో వచ్చిన జన్యు మార్పులే. వైరస్ చుట్టూ ఉండే కొవ్వులాంటి ముళ్ల పదార్థం సైజు పెరిగింది. ఆ ముళ్లు మరింత పెద్దవి అయ్యాయి. కాబట్టి... ఈ వైరస్ వేగంగా బాడీలోకి వెళ్లేందుకూ, కణానికి అతుక్కునేందుకు ఆ ముళ్లు బాగా పనిచేస్తున్నాయి. అందువల్ల డెల్టా ప్లస్ విషయంలో ఇండియా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉంది. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 1,061 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,18,837కి చేరాయి. కొత్తగా 1,556 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 5,99,695కి చేరింది. రికవరీ రేటు 96.90 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 11 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,618కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,524 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 91,849 టెస్టులు చెయ్యగా... కొత్తగా 4,458 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,71,475కి చేరింది. కొత్తగా 38 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,528కి చేరింది. కొత్తగా 6,313 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 18,11,157కి చేరింది. ప్రస్తుతం 47,790 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,15,41,485 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 3,99,789 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18.11 కోట్లు దాటింది. కొత్తగా 8,261 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 39.24 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.14 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 14,551 కేసులు, 376 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 79,277 కొత్త కేసులు... 1,860 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు బ్రెజిల్లో వస్తుంటే... ఆ తర్వాత ఇండియా, కొలంబియా, అర్జెంటినా, రష్యా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంటుంటే... ఆ తర్వాత ఇండియా, కొలంబియా, రష్యా, అర్జెటినా ఉన్నాయి. (image credit - twitter - reuters)