India Covid Updates : కరోనా కలకలం.. పెరిగిన వ్యాప్తి.. కొత్తగా 17,135 కేసులు, 47 మరణాలు..
India Covid Updates : కరోనా కలకలం.. పెరిగిన వ్యాప్తి.. కొత్తగా 17,135 కేసులు, 47 మరణాలు..
దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించి మళ్లీ ఆందోళన పెరిగింది. కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన కొత్త కేసుల సంఖ్య తాజాగా భారీగా పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ (ఆగస్టు 3, బుధవారం) వెల్లడించిన గణాంకాల వివరాలివే..
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మొత్తం 4,64,919 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 17,135 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,40,67,144కు చేరాయి. ఇప్పటిదాకా జరిపిన టెస్టుల సంఖ్య 87.63 కోట్లకు చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
గడిచిన 24 గంటల్లో 17,135 మంది బాధితులు కొవిడ్ బారినుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తద్వారా మొత్తం కరోనా కేసుల్లో 4,34,03,610 మంది బాధితులు కోలుకున్నట్లయింది. జాతీయ రికవరీ రేటు 98.49%గా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
దేశంలో కొవిడ్ పాజిటివిటీ రేటు స్వల్పంగా పెరిగింది. కిందటి రోజు 3.34 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు తాజాగా 3.69శాతానికి చేరినట్లు బుధవారం నాటి బులిటెన్ లో పేర్కొన్నారు. వీక్లీ పాజిటివిటీ రేటు 4.67 శాతంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
గడిచిన మూడు రోజులుగా కొత్త కేసులు తగ్గినా, నిన్న భారీగా పెరిగినా, రికవరీలు గణనీయంగా ఉండటంతో యాక్టివ్ కేసులు తగ్గాయి. ప్రస్తుతం దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,37,057గా ఉంది. యాక్టివ్ కేసుల రేటు 0.31శాతంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి వల్ల 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 5,26,477 మంది కొవిడ్ వ్యాధికి బలయ్యారు. దేశంలో మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా నిన్న ఒక్కరోజే 23,49,651 డోసుల టీకాలను పంపిణీ చేశారు. ఇప్పటివరకు 204.84 కోట్ల కొవిడ్ టీకా డోసులను పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 8,21,908 కేసులు, మరో 1,938 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 583,944,874 కు, మరణాల సంఖ్య 64,18,751కు చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)