India Covid Updates : తగ్గిన కరోనా వ్యాప్తి.. కొత్తగా 14,830 కేసులు, 36 మరణాలు..
India Covid Updates : తగ్గిన కరోనా వ్యాప్తి.. కొత్తగా 14,830 కేసులు, 36 మరణాలు..
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కాస్త ఊరట వాతావరణం నెలకొంది. సోమవారం నాడు అత్యధిక పాజిటివిటీ రేటు నమోదుకాగా, మంగళవారం నాటికి అది అదుపులోకి వచ్చింది. కొత్త కేసులు, మరణాల సంఖ్యపై కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ (జులై 26న) వెల్లడించిన వివరాలివే..
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మొత్తం 4,26,102 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 14,830 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,39,20,451కి చేరాయి. ఇప్పటిదాకా జరిపిన టెస్టుల సంఖ్య 87.31 కోట్లకు చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
గడిచిన 24 గంటల్లో 18,159 మంది బాధితులు కొవిడ్ బారినుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తద్వారా మొత్తం కరోనా కేసుల్లో 4,32,46,829 మంది బాధితులు కోలుకున్నట్లయింది. జాతీయ రికవరీ రేటు 98.47%గా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
దేశంలో కొవిడ్ పాజిటివిటీ రేటు 168 రోజుల తర్వాత నిన్న సోమవారం నాడు ఒక్కసారే 7 శాతానికి పెరగడం ఆందోళన కలిగించగా, మంగళవారం నాటి లెక్కల్లో మాత్రం డైలీ పాజిటివిటీ రేటు 3.48 శాతానికి తగ్గింది. వీక్లీ పాజిటివిటీ రేటు 4.53 శాతంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
గడిచిన నాలుగైదు రోజులుగా కొత్త కేసులు తగ్గుతూ, రికవరీలు పెరగడంతో యాక్టివ్ కేసులు తగ్గాయి. ప్రస్తుతం దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,47,512కు తగ్గింది. యాక్టివ్ కేసుల రేటు 0.34శాతంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి వల్ల 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 5,26,110 మంది కొవిడ్ వ్యాధికి బలయ్యారు. దేశంలో మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా నిన్న ఒక్కరోజే 30,42,476 డోసుల టీకాలను పంపిణీ చేశారు. ఇప్పటివరకు 202.5 కోట్ల కొవిడ్ టీకా డోసులను పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ప్రపంచవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3,11,365 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క చైనాలోనే నిన్న 976 కేసులు వచ్చాయి. ఇప్పటిదాకా గ్లోబల్ గా మొత్తం కేసుల సంఖ్య 576,192,559గా, మరణాల సంఖ్య 6,405,163గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)