ఇండియాలో సెకండ్ వేవ్ తగ్గుతున్నా... అక్టోబర్ లేదా నవంబర్‌లో థర్డ్ వేవ్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. మరో సంవత్సరం పాటూ కరోనా సమస్య ఇలాగే ఉంటుందనీ... తేలిగ్గా తీసుకోవద్దని అంటున్నారు. మాస్క్ తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నారు. జూన్ 3 నుంచి 17 వరకు ప్రపంచవ్యాప్తంగా ఓ సర్వే జరిగింది. అందులో 40 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు, డాక్టర్లు, పరిశోధకులు, వైరాలజిస్టులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఇండియాలో సెకండ్ వేవ్ తగ్గిపోతుందనీ... కానీ అక్టోబర్‌లో థర్డ్ వేవ్ రావొచ్చని వారు అంచనా వేశారు. ఐతే... థర్డ్ వేవ్‌ని ఇండియా బలంగా ఎదుర్కోగలదని అభిప్రాయపడ్డారు. (image credit - twitter - reuters)
తెలంగాణలో జూన్ 20 నుంచి లాక్డౌన్ ఎత్తివేస్తారని ప్రచారం జరుగుతున్నా... ప్రభుత్వం వైపు నుంచి ఈ దిశగా ప్రకటన వచ్చే సంకేతాలు కనిపించట్లేదు. సడలింపులు మరింత పెంచి... రాత్రి కర్ఫ్యూ సమయాన్ని మరింత తగ్గించి... జూన్ 30 వరకూ లాక్డౌన్ పొడిగిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐతే... దీనిపై ఇవాళ జరిగే క్యాబినెట్ సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ప్రస్తుతం తెలంగాణలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ సాధారణ పరిస్థితులు... సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇది జూన్ 19తో ముగియనుంది.
Covid 19 Updates: ఇండియాలో కొత్తగా 62,480 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,97,62,793కి చేరింది. కొత్తగా 1,587 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,83,490కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.16 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 88,977 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,85,80,647కి చేరింది. రికవరీ రేటు కొద్దిగా పెరిగి 96 శాతానికి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 7,98,656 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 19,29,476 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 38 కోట్ల 71 లక్షల 67 వేల 696 టెస్టులు చేశారు. కొత్తగా 32,59,003 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 26 కోట్ల 89 లక్షల 60 వేల 399 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 1,417 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,10,834కి చేరాయి. కొత్తగా 1,897 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 5,88,259కి చేరింది. రికవరీ రేటు 96.30 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 12 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,546కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,029 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 1,07,764 టెస్టులు చెయ్యగా... కొత్తగా 6,341 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,39,243కి చేరింది. కొత్తగా 57 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,224కి చేరింది. కొత్తగా 8,486 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 17,59,390కి చేరింది. ప్రస్తుతం 67,629 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,09,46,911 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 3,97,734 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 17.85 కోట్లు దాటింది. కొత్తగా 8,484 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 38.66 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.16 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 12,919 కేసులు, 384 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 98,135 కొత్త కేసులు... 2,449 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు బ్రెజిల్లో వస్తుంటే... ఆ తర్వాత ఇండియా, కొలంబియా, అర్జెంటినా, రష్యా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా... ఆ తర్వాత ఇండియా, కొలంబియా, అర్జెంటినా, రష్యా ఉన్నాయి. (image credit - twitter - reuters)