Covid 19 Updates: ఇండియాలో మొన్న 60,471 కేసులు రాగా... నిన్న 62,224 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,96,33,105కి చేరింది. కొత్తగా మొన్న 2,726 మంది చనిపోగా... నిన్న 2,542 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,79,573కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.16 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 1,07,628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,83,88,100కి చేరింది. రికవరీ రేటు కొద్దిగా పెరిగి 95.6 నుంచి 95.8 శాతానికి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 8,65,432 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 19,30,987 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 38 కోట్ల 33 లక్షల 06 వేల 971 టెస్టులు చేశారు. కొత్తగా 28,00,458 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 26 కోట్ల 19 లక్షల 72 వేల 014 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. (image credit - NIAID)
ఇండియాలో 24 గంటల్లో యాక్టివ్ కేసులు 47,946 తగ్గాయి. ప్రస్తుతం డైలీ కేసుల్లో ఇండియాలోనే అత్యధికంగా కేరళలో వచ్చాయి. నిన్న అక్కడ కొత్త కేసులు 12,246 రాగా... ఆ తర్వాత తమిళనాడులో 11,805 వచ్చాయి. నెక్ట్స్ మహారాష్ట్రలో 7,652 వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 10 వేల కంటే ఎక్కువ కొత్త కేసులు వస్తున్న రాష్ట్రాలు 2 మాత్రమే ఉన్నాయి. అలాగే... 5వేల కంటే ఎక్కువ కేసులు వస్తున్న రాష్ట్రాలు 5 మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ మంచి సంకేతాలు. మరణాలు కూడా తగ్గడం మరో మంచి అంశం. రికవరీ రేటు కూడా పెరుగుతోంది. మొత్తంగా చూస్తే సెకండ్ వేవ్ తగ్గినట్లే అనుకోవచ్చు. అందుకే ఇక థర్డ్ వేవ్‌పై రాష్ట్రాలు ఫోకస్ పెడుతున్నాయి. (image credit - twitter - reuters)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 1,556 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,06,436కి చేరాయి. కొత్తగా 2,070 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 5,82,993కి చేరింది. రికవరీ రేటు 96.13 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 14 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,510కి చేరాయి. మరణాల రేటు 0.57 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,933 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 96,153 టెస్టులు చెయ్యగా... కొత్తగా 5,741 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,20,134కి చేరింది. కొత్తగా 53 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,052కి చేరింది. కొత్తగా 10,567 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 17,32,948కి చేరింది. ప్రస్తుతం 75,134 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,06,34,891 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 3,35,429 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 17.73 కోట్లు దాటింది. కొత్తగా 8,021 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 38.36 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.17 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 10,722 కేసులు, 318 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 88,992 కొత్త కేసులు... 2,760 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు బ్రెజిల్లో వస్తుంటే... ఆ తర్వాత ఇండియా, అర్జెంటినా, రష్యా, అమెరికా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా... ఆ తర్వాత ఇండియా, అర్జెంటినా, రష్యా, అమెరికా ఉన్నాయి. (image credit - twitter - reuters)