కరోనాకి విరుగుడుగా వేసుకుంటున్న వ్యాక్సిన్ ద్వారా ఇండియాలో తొలిసారిగా ఓ వ్యక్తి చనిపోయారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. 68 ఏళ్ల ఓ వ్యక్తి మార్చి 31న చనిపోయారనీ... వ్యాక్సిన్ రియాక్షన్ ఇవ్వడం వల్లే అలా జరిగిందని చెప్పింది. ఇలాంటి రియాక్షన్ కేసులు ఇండియాలో 31 రాగా... వాటిలో 28 మంది చనిపోయారు. ఐతే... వారు చనిపోవడానికి వ్యాక్సిన్ కారణం కాదనీ... అనాఫిలాక్సిస్ రియాక్షనే కారణం అని కేంద్రం చెప్పింది. అందువల్ల ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపింది. (image credit - Twitter)
కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేయించుకున్న వారు తమ దేశానికి రావొచ్చని అమెరికా తెలిపింది. భారతీయ విద్యార్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందువల్ల విద్యార్థులు సంతోషంగా ఫీలవుతున్నారు. ఐతే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)... కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కి అనుమతి ఇవ్వలేదు. అందువల్ల చాలా దేశాలు ఈ వ్యాక్సిన్‌ను వ్యాక్సిన్‌గా గుర్తించట్లేదు. ఇది వేసుకున్న వారిని తమ దేశంలోకి రానిచ్చేందుకు అంగీకరించట్లేదు. WHO అనుమతి పొందేందుకు దీన్ని తయారుచేస్తున్న భారత్ బయోటెక్ కంపెనీ ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ కంపెనీ... ఈ వ్యాక్సిన్‌ను రూ.150 కంటే ధర తగ్గించలేమని ప్రకటించింది. ఇప్పటికే నష్టానికే కేంద్రానికి రూ.150కి అమ్ముతున్నామని చెప్పింది. (image credit - Twitter - reuters)
థర్డ్ వేవ్ వస్తుందో లేదో తెలియదు. అది వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై రెడీ అవుతూనే మరోవైపు ఆర్థిక వ్యవస్థను కోలుకునేలా చేసేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించగా... తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 20 నుంచి సడలింపులను మరింత పెంచేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. పగటిపూట ఆంక్షలు ఎత్తివేస్తుందని సమాచారం. ప్రజలు కూడా ఒకేసారి కాకుండా... క్రమంగా సడలింపులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. (image credit - Twitter - reuters)
Covid 19 Updates: ఇండియాలో కొత్తగా 60,471 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,95,70,881కి చేరింది. కొత్తగా 2,726 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,77,031కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.16 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 1,17,525 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,82,80,472కి చేరింది. రికవరీ రేటు కొద్దిగా పెరిగి 95.6కి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 9,13,378 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,51,358 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 38 కోట్ల 13 లక్షల 75 వేల 984 టెస్టులు చేశారు. కొత్తగా 39,27,154 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 38 కోట్ల 13 లక్షల 75 వేల 984 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. (image credit - Twitter - reuters)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 1,556 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,06,436కి చేరాయి. కొత్తగా 2,070 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 5,82,993కి చేరింది. రికవరీ రేటు 96.13 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 14 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,510కి చేరాయి. మరణాల రేటు 0.57 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,933 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 96,153 టెస్టులు చెయ్యగా... కొత్తగా 5,741 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,20,134కి చేరింది. కొత్తగా 53 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,052కి చేరింది. కొత్తగా 10,567 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 17,32,948కి చేరింది. ప్రస్తుతం 75,134 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,06,34,891 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 3,35,429 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 17.73 కోట్లు దాటింది. కొత్తగా 8,021 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 38.36 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.17 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 10,722 కేసులు, 318 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 88,992 కొత్త కేసులు... 2,760 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు బ్రెజిల్లో వస్తుంటే... ఆ తర్వాత ఇండియా, అర్జెంటినా, రష్యా, అమెరికా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా... ఆ తర్వాత ఇండియా, అర్జెంటినా, రష్యా, అమెరికా ఉన్నాయి. (image credit - twitter - reuters)