India COVID-19: మన దేశ జనాభాలో యువత ఎక్కువే. ఇప్పుడు వారికి త్వరగా వ్యాక్సిన్ వెయ్యాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా థర్డ్ వేవ్ ఎప్పుడైనా రావచ్చనే భయాలు వెంటాడుతున్నాయి. డెల్టా ప్లస్, డెల్టా ప్లస్ 2 అనే వేరియంట్లు మరింత భయంకరంగా ఉన్నాయి. అవి ఇండియాలో జోరుగా వ్యాపిస్తే... సెకండ్ వేవ్‌ని మించిన దారుణాలు చూడాల్సి రావచ్చు. (image credit - twitter)
అందువల్ల అలా జరగకుండా ఉండాలంటే... వీలైనంత త్వరగా పిల్లలకు వ్యాక్సిన్లు వేసేయాలి. 2 ఏళ్లకు పైబడిన పిల్లలందరికీ సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్లు వేయగలం అని ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా (randeep guleria) చెప్పారు. (image credit - twitter - ANI)
అక్టోబర్ లేదా నవంబర్‌లో థర్డ్ వేవ్ రావచ్చనే అంచనాలున్నాయి. అది వచ్చేలోపే... పిల్లలకు వ్యాక్సిన్లు వేసేయగలిగితే... ఇక థర్డ్ వేవ్ పెద్దగా ఉండదు. కానీ ఈ ప్రక్రియ సవ్యంగా జరుగుతుందా అనేది తేలాల్సిన ప్రశ్న. ఈ గులేరియా ఏం చెప్పినా అది కీలకం అవుతోంది. ఎందుకంటే... ఆయన కేంద్రం కరోనా టాస్క్ ఫోర్స్ పేరుతో ఏర్పాటు చేసిన టీమ్‌లో కీలక సభ్యుడిగా ఉన్నారు. (image credit - twitter)
ప్రస్తుతం పిల్లలకు హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ (Covaxin)ను ట్రయల్ కింద ఇస్తున్నారు. మొత్తం 3 ట్రయల్స్‌లో రెండు పూర్తయ్యాయి. 2వ దశ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబర్ నాటికి వస్తాయి. అదే నెలలో కేంద్రం అనుమతి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు సెప్టెంబర్‌లోనే పిల్లలకు వ్యాక్సిన్ వేయగలరు. కేంద్ర ప్రభుత్వం... పైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌కి అనుమతి ఇస్తే... పిల్లలకు వేసేందుకు అది కూడా ఆప్షన్ కానుంది అని గులేరియా చెప్పారు. (image credit - Twitter - reuters)
స్కూళ్లు తెరవొచ్చా?: గులేరియా చెప్పేదాని ప్రకారం చూస్తే... తెరవకపోవడమే మేలు అన్నట్లు ఉంది. ఆయన ఏమన్నారంటే... "స్కూళ్లు సూపర్ స్ప్రెడర్ల నిలయాలు కాకూడదు. ప్రభుత్వాలు స్కూళ్లు తెరిచే ముందు ఈ విధంగా ఆలోచించాలి" అన్నారు. సెకండ్ వేవ్ సమయంలో కూడా స్కూళ్లు తెరిచి ఉండటం వల్లే కరోనా బాగా పెరిగిందనే ప్రచారం జరిగింది. ప్రధానంగా పిల్లలు పెద్దవాళ్లకు కరోనాను అంటించే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పుడు థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు స్కూళ్లు తెరవడం అనేది మంచిది కాదన్నది గులేరియా అభిప్రాయంగా కనిపిస్తోంది. (image credit - twitter)
కంటైన్మెంట్ జోన్లు లేని చోట పిల్లలను రోజు విడిచి రోజు స్కూలుకు రమ్మనడం కొంత వరకూ బెటర్ అంటున్నారు గులేరియా. కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించేలా చెయ్యాలంటున్నారు. స్కూళ్లలో గాలి బాగా ప్రసరించే ఏర్పాట్లు ఉండాలంటున్నారు. భారత వాతావరణంలో బయటివైపు కరోనా ఎక్కువసేపు జీవించే అవకాశాలు తక్కువని తెలిపారు. (image credit - twitter)
థర్డ్ వేవ్ వల్ల చిన్న పిల్లలే ఎక్కువగా టార్గెట్ అవుతారని తాను అనుకోవట్లేదని గులేరియా చెప్పారు. ఎయిమ్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కలిసి... జరిపిన అధ్యయనంలో పిల్లల్లో సీరో-పాజిటివిటీ రేటు ఎక్కువగానే ఉంది. అందువల్ల పిల్లలు కరోనాను ఎదుర్కోగలరు. అందుకే పిల్లలకే కరోనా ఎక్కువగా సోకుతుంది అనే అభిప్రాయంతో గులేరియా ఏకీభవించట్లేదు. (image credit - twitter)