తెలంగాణ ప్రభుత్వం ఒకింత ధైర్యంతో నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పూర్తిగా తగ్గకుండానే... లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. ఇందుకు ప్రధాన కారణం... చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు తగ్గుతూ ఉండటమే. ప్రజల్ని ఇబ్బంది పెట్టి లాక్డౌన్ కొనసాగించడం కంటే... కరోనాతో తాడో పేడో తేల్చుకునేందుకే ప్రభుత్వం సిద్ధమైంది. ఫలితంగా ఇవాళ్టి నుంచి లాక్డౌన్ అన్నది లేదు. అన్ని రకాల రూల్సూ సడలించింది. ఐతే ప్రజలు మాస్క్ ధరిస్తూ, సేఫ్ డిస్టాన్స్ పాటించాలని చెప్పింది. హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు సోమవారం నుంచి రెగ్యులర్ టైమింగ్స్‌తో నడవనున్నాయి. అంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ నడుస్తాయి. చివరి ట్రైన్ స్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరుతుంది. నేటి నుంచి తెలంగాణలో థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. విద్యా సంస్థలేమో జులై 1 నుంచి ప్రారంభమవుతాయి. (image credit - twitter)
కరోనా థర్డ్ వేవ్ తప్పక వస్తుందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. దాన్నుంచి తప్పించుకునే దిశగా చర్యలు ఉండాలన్నారు. ఐతే... లాక్డౌన్ నిబంధనలు సడలించాక... ప్రజలు సరైన కరోనా జాగ్రత్తలు పాటించట్లేదనీ అందువల్లే 6 నుంచి 8 వారాల్లో థర్డ్ వేవ్ వస్తుందని అన్నారు. రాష్ట్రాల్లో ఎక్కడైతే పాజిటివ్ కేసులు 5 శాతానికి మించుతాయో అక్కడ మినీ లాక్డౌన్లు పెట్టాలని సూచించారు. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెంచడం తప్పేమీ కాదన్న ఆయన... మంచిదే అన్నారు. (image credit - twitter)
Covid 19 Updates: ఇండియాలో కొత్తగా 60,753 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,98,23,546కి చేరింది. కొత్తగా 1,647 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,85,137కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.17 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 97,743 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,86,78,390కి చేరింది. రికవరీ రేటు కొద్దిగా పెరిగి 96.2 శాతానికి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 7,60,019 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 19,02,009 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 38 కోట్ల 92 లక్షల 07 వేల 637 టెస్టులు చేశారు. కొత్తగా 33,00,085 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 27 కోట్ల 23 లక్షల 88 వేల 783 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 1,362 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,12,196కి చేరాయి. కొత్తగా 1,813 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 5,90,072కి చేరింది. రికవరీ రేటు 96.38 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 10 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,556కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,568 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 1,03,935 టెస్టులు చెయ్యగా... కొత్తగా 5,674 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,44,917కి చేరింది. కొత్తగా 45 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,269కి చేరింది. కొత్తగా 8,014 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 17,67,404కి చేరింది. ప్రస్తుతం 65,244 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,10,50,846 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 3,47,649 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 17.89 కోట్లు దాటింది. కొత్తగా 7,680 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 38.74 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.15 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 7,276 కేసులు, 166 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 81,574 కొత్త కేసులు... 2,247 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు బ్రెజిల్లో వస్తుంటే... ఆ తర్వాత ఇండియా, కొలంబియా, రష్యా, అర్జెంటినా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా... ఆ తర్వాత ఇండియా, కొలంబియా, అర్జెంటినా, రష్యా ఉన్నాయి. (image credit - twitter - reuters)