Omicron: ముంచుకొస్తున్న ఒమిక్రాన్ ముప్పు.. స్కూళ్లను మళ్లీ మూసివేయాల్సిందేనా..
Omicron: ముంచుకొస్తున్న ఒమిక్రాన్ ముప్పు.. స్కూళ్లను మళ్లీ మూసివేయాల్సిందేనా..
Omicron Variant: మన దేశం ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న వేళ.. ఒమిక్రాన్ వేరియెంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. WHOతో పాటు కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. మళ్లీ ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో స్కూళ్లను కూడా మూసివేస్తున్నారు.
భారత్‌లో పిల్లల చదువులు ఇప్పుడిప్పుడే గాడినపడుతున్నాయి. రెండేళ్లుగా ఆగిపోయిన చదువులు మళ్లీ ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒరిక్రాన్ ముప్పు మరోసారి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటికే పలు చోట్ల విద్యా సంస్థలు మూతపడుతున్నాయి.
2/ 7
ఒమిక్రాన్ నేపథ్యంలో మహారాష్ట్రలో ఇప్పుడే స్కూళ్లు తెరవద్దని అక్కడ అధికార యంత్రాంగం నిర్ణయించింది. నాగ్‌పూర్‌లో 1 నుంచి 7 వ తరగతి విద్యార్థులకు క్లాస్‌లను నిర్వహించబోమని తెలిపింది. డిసెంబరు 10 వరకు వేచిచూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఒమిక్రాన్ కారణంగా ముంబై, పుణెలో స్కూళ్ల పున:ప్రారంభం వాయిదా పడింది. డిసెంబరు 15 వరకు పాఠశాలలను తెరవద్దని అధికారులు నిర్ణయించారు. (ప్రతీకాత్మక చిత్రం )
4/ 7
హర్యాణాలో మరికొన్ని రోజుల పాటు 50శాతం సామర్థ్యంతోనే స్కూళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. 100శాతం కెపాసిటీతో ఇప్పుడే స్కూళ్లను నిర్వహించద్దని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఒమిక్రాన్ చాలా ప్రమాదకరమైన వేరియెంట్ అని వైద్య నిపుణులతో పాటు డబ్ల్యూహెచ్‌వో కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాలు కూడా స్కూళ్ల మూసివేతపై దృష్టిసారించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియెంట్ వణికిస్తోంది. సౌతాఫ్రికా నుంచి ఇతర దేశాలకుఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గతంలో వచ్చిన అన్ని వేరియెంట్ల కంటే ఇది భయంకరమైనదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. ఇప్పటికే పలు దేశాలు తమ సరిహద్దులను మూసివేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఆఫ్రికాతో పాటు ఇప్పటికే ఒమిక్రాన్ కరోనా కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై భారత ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎయిర్‌పోర్టుల్లో పరీక్షలు చేసి, వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)