India Corona cases: భారత్‌పై కరోనా థర్డ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. రోజువారీ కేసులు లక్ష దాటాయి. గడిచిన 24 గంటల్లో 1,17,100 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గురువారం దేశవ్యాప్తంగా 30,836 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న 302 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే ఏకంగా లక్షకు పైగా కేసులు రావడంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన నెలకొంది. కొత్త కేసులు ఏకంగా 216 రోజుల గరిష్టానికి చేరుకున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,52,26,386కి చేరింది. భారత్‌లో ఇప్పటి వరకు 3,43,71,845 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,83,178 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 3,71,363 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసులు మూడు లక్షలు దాటడంతో అన్ని ప్రభుత్వాలు మళ్లీ ఆస్పత్రుల్లో సౌకర్యాలపై దృష్టిసారించాయి. (ప్రతీకాత్మక చిత్రం)