శ్రీలంక తరహాలో ప్రకటిత ఆర్థిక సంక్షోభం లేనప్పటికీ భారత్ లో కొద్ది నెలలుగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నిత్యావసరాల నుంచి పెట్రో దాకా అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా అత్యధికులకు ఆహారమైన గోధుమపిండి రేటు కూడా రాకెట్ లా దూసుకుపోతున్నది. 1కేజీ గోధుమపిండి ధర మూడంకెల మార్కును చేరనున్నవేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
పెరిగిపోతున్న ఆహార ధాన్యాల ధరలకు సామాన్యులు సతమతం అవుతుండడంతో కేంద్రం చర్యలు తీసుకుంది. గోధుమ ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దేశీయంగా గోధుమల దిగుబడి తగ్గడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపచం వ్యాప్తంగా గోధుమలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందిప్పుడు.(ప్రతీకాత్మక చిత్రం)
గోధుమ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఉంది. గోధుమల ఎగుమతిలో రష్యా, ఉక్రెయిన్ కూడా ప్రధాన దేశాలుగా ఉండగా, ఇప్పుడవి యుద్ధం చేసుకుంటుండటంతో గ్లోబల్ గా గోధుమలకు కొరత ఏర్పడి డిమాండ్ భారీగా పెరిగింది. మార్కెట్ పరంగా భారత్ దీనిని అవకాశంగా భావించే వీలున్నా, దేశీయంగా దిగుబడి తగ్గడంతో ప్రజలకు తిండిగింజలు దొరకని స్థితి ఏర్పడొద్దనే ఉద్దేశంతో ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది.(ప్రతీకాత్మక చిత్రం)
గోధుమల ఎగుమతులపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. అయితే ఇప్పటికే పూర్తయిన ఒప్పందాలు, ఎగుమతి కోసం లెటర్స్ ఆఫ్ క్రెడిట్ పొందిన షిప్ మెంట్లకు మాత్రం అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. యూరప్ సహా చాలా దేశాలకు గోధుమలు ఎగుమతి చేయడంలో కీలకంగా ఉండిన ఉక్రెయిన్, రష్యా గత నాలుగు నెలలుగా యుద్దం చేస్తుండటంతో అంతర్జాతీయంగా కొనుగోలుదారులు భారత గోధుమ సరఫరాలపై ఆధారపడ్డారు. దీంతో విపరీతమైన డిమాండ్ పెరిగి, దేశీయంగా గోధుమల ధరలు, గోధుమ పిండి, దాని సంబంధిత అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి. (ప్రతీకాత్మక చిత్రం)
మన దేశంలో గడిచిన కొద్ది రోజుల్లోనే గోధుమల ధరలు సుమారు 14-20 శాతం మేర పెరిగాయి. 14 ఏళ్ల గరిష్ఠానికి గోధుమల ధరలు చేరాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ మంటల కారణంగా రవాణా వ్యయాలు పెరిగిపోవడం, ఇథనాల్ తయారీలో గోధుమలను వినియోగించడం వంటి కారణాలు కూడా తోడై గోధుమ ఆధారిత ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి.(ప్రతీకాత్మక చిత్రం)
పెరుగుతున్న దేశీయ ధరలను నియంత్రించెందుకు చర్యల్లో భాగంగా గోధుమల ఎగుమతులను తక్షణమే నిషేధించినట్లు కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) పేరుతో శుక్రవారం రాత్రి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఆహార భద్రత అవసరాలను తీర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో గోధుమల దిగుబడి గణనీయంగా తగ్గినట్లు రిపోర్టులు వెలువడ్డాయి. రాబోయే ఏడాదికి సంబంధించి కేంద్రం గోధుమల ఉత్పత్తి అంచనాలను 5.7 శాతం తగ్గించి 105 మిలియన్ టన్నులుగా పేర్కొంది. దీంతో గోధుమల సేకరణ విషయంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న టార్గెట్ లో సగం కూడా ఈసారి రాదని గుర్తించారు. (ప్రతీకాత్మక చిత్రం)
మే 13(శుక్రవారం) నాటికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) కేవలం 17 మెట్రిక్ టన్నుల గోధుమలను మాత్రమే సేకరించింది. గతేడాదితో ఇదే సీజన్ తో పోలిస్తే ఈ సంఖ్య సగం మాత్రమే. ఈ ఏడాది ఎండలు విపరీతంగా పెరిగి, ఉత్తరాదిలోనూ 122 ఏళ్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన దరిమిలా గోధుమల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. (ప్రతీకాత్మక చిత్రం)
గోధుమల ఎగుమతిలో ప్రపంచంలోనే రష్యా ప్రధమ స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో, ఉక్రెయిన్ 4వ స్థానంలో ఉన్నాయి. టాప్ 4దేశాల్లో రెండు యుద్దం చేసుకుంటుండటంతో గ్లోబల్ గా గోధుమలకు కొరత ఏర్పడింది. దీంతో అన్ని దేశాలూ భారత్ వైపునకు మళ్లాయి. మొన్న ఏప్రిల్ లో గోధుమల ఎగుమతులు గరిష్టస్థాయికి చేరాయి. అంతర్జాతీయ సంస్థలు నేరుగా మన రైతుల నుంచి భారీ ఎత్తున గోధుమలు సేకరిస్తున్నట్లు రిపోర్టులు వచ్చాయి.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రపంచవ్యాప్తంగా గోధుమల ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా 35 మిలియన్ టన్నుల గోధుమల కొరత ఏర్పడబోతున్నట్లు అమెరికా వ్యవసాయ విభాగం అంచనా వేసింది. దేశీయంగా గోధుమపిండి ధర త్వరలోనే రూ.100 మార్కును దాటనుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే భారత్ గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది.(ప్రతీకాత్మక చిత్రం)