నేడు భారతదేశ ప్రజలు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా కొన్ని విషయాలను మనం తప్పుకుండా గుర్తుంచుకోవాలి. జాతీయ గౌరవచిహ్నాల పరిరక్షణ (అవమాన నిరోధక) చట్టం -1971లోని నిబంధనల ప్రకారం.. జాతీయజెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను, స్వాతంత్య్ర యోధులను గౌరవించడం పౌరుల ప్రాధమిక విధి.