ప్రేమ ఫెయిలవ్వడం వల్లే 350 మంది అమ్మాయిలు చనిపోయారని ప్రభుత్వమే అధికారికంగా చెప్పింది. ఈ 350 మందిలో 10 మంది మర్డర్ అవ్వగా... మిగతా 340 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ డేటా రిలీజ్ చేశారు. ఎమ్మెల్యే ఎం కే మునీర్... ఈమధ్యే ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో అడిగిన ప్రశ్నకు ఈ డేటా ఇచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ సూసైడ్లలో ఎక్కువగా జరిగింది గతేడాదే. ప్రేమ ఫెయిలైన యువకులు... ఇద్దరు అమ్మాయిలను చంపేయగా... మరో 96 మంది యువతులు స్వయంగా చనిపోయారు. 2019లో ఐదుగురు అమ్మాయిలను యువకులు చంపేయగా... 88 మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. 2018లో 76 మంది అమ్మాయిలు ప్రాణాలు వదులుకోగా... 2017లో ముగ్గుర్ని బాయ్ ఫ్రెండ్స్ చంపేయగా.. 80 మంది సూసైడ్ చేసుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ డేటాను బట్టీ... అమ్మాయిలు లవ్ ఫెయిలైతే... చాలా లోతుగా ఫీలవుతున్నట్లు అర్థమవుతోందని మానసిక వేత్త డాక్టర్ పీఎన్ సురేష్ కుమార్ అన్నారు. "మానసిక పరిపక్వత లేని వారు పరిస్థితులను తట్టుకొని నిలబడలేరు. అంటే ప్రేమలో ఫెయిలవ్వడం లాంటి ఘటనలు. అలా జరిగినప్పుడు వారు ఆత్మహత్య చేసుకోవడం లేదా హత్య చేయడం వంటివి చేస్తారు. మనుషుల్లో మానసిక పరిపక్వతను పెంచడమే దీనికి పరిష్కారం" అని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)