దక్షిణాది రాష్ట్రాలకు కూడా భారీ వర్ష సూచన ఉంది. అరేబియా సముద్రం నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావంతో కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే 5 రోజుల్లో కేరళ, లక్షద్వీప్‌లలో ఉరుములతో కూడిన తేలికపాటి/మోస్తరు వర్షాలు కురుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇక ఇవాళ్టి నుంచి జూన్ 1 వరకు కేరళ, మాహేలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. మే 30న లక్షద్వీప్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈసారైనా వాతావరణశాఖ అంచనాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు వస్తే.. రైతులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. వర్షాలు మొదలైన వెంటనే సాగు పనులను ప్రారంభిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)