వర్నాలీ ఆఫీస్‌లో దీపక్ దాస్ అనే ముసలాయన ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన.. ఈమె లంచ్ బాక్స్‌ని క్యారీ బ్యాగ్‌లో తేలేదు. అలా ఎందుకు తేలేదని ఫైర్ అయిన వర్నాలీ.. చెంప చెళ్లుమనిపించారు. అదే లంచ్ బాక్స్‌తో శనివారం సాయంత్రం ఆయనపై దాడి చేశారు. లంచ్ బాక్స్ లోని ఫుడ్ ఆయనపై పడింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను కోరారు." width="854" height="1280" /> బాధితుడైన దీపక్ దాస్.. డీసీ ఆఫీసులో ప్యూన్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకి కోక్రోఝార్ RNB ఆస్పత్రిలో ట్రీట్మెంట్ జరుగుతోంది. తోటి ఉద్యోగిని ట్రీట్ చేసే విధానం ఇదేనా అని దీపక్ దాస్ కూతురు ఆవేదన వ్యక్తం చేశారు. డీసీపై చర్యలు తీసుకోవాలని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను కోరారు.
దీనిపై మీడియాతోపాటూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరగడం, నెటిజన్లు వర్నాలీపై ఫుల్లుగా కౌంటర్లు ఇవ్వడంతో... దిగివచ్చిన వర్నాలీ క్షమాపణ చెప్పినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వస్తేగానీ ఆమె ఈ క్షమాపణ చెప్పలేదు. ఇండియాలో ఇదే జరుగుతోంది. చాలా మంది డిగ్నిటీ ఆఫ్ లేబర్‌కి విలువ ఇవ్వట్లేదు. కానీ అలాంటి వాళ్లే పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంటుండటం భారత్ చేసుకున్న దురదృష్టం.