ఆలయ ప్రధాన గోపురం నుంచి తూర్పు దిశలో మరో మూడు మండపాలు ఉంటాయి. వీటిని గుణ మండపం, రంగ మండపం, నృత్య మండపంగా పిలుస్తారు. ఇది కాకుండా ఆలయానికి తూర్పు వైపున సింహద్వారం ఉంటుంది. గుణ మండపానికి కుడి, ఎడమ వైపున మరో రెండు మండపాలను నిర్మించనున్నారు. ఆలయంలో మొత్తం 5 శిఖరాలు ఉంటాయి.