లాహౌల్ పోలీసుల ప్రకారం మంచు కారణంగా మనాలి-లేహ్ నేషనల్ హైవే (NH-003)పై అన్ని రకాల వాహనాల రాకపోకలనూ ఆపేశారు. అలాగే దర్చా శింకుల మార్గ్, పాంగి కిల్లర్ హైవే (SH-26) కూడా క్లోజ్ చేశారు. గ్రాఫు నుంచి కాజా వరకు కాజా రహదారి (NH-505)ని మూసివేశారు. సుమ్డో నుంచి లోసర్ వరకు మాత్రం 4*4 వాహనాలకు అనుమతి ఇచ్చారు.