Haryana: ఈ ఫొటోలు చూశారా... ఇది హర్యానాలోని అత్యంత మోడ్రన్ సిటీ గురుగ్రామ్ (gurugram) అంటే నమ్మడం కష్టమే. సాఫ్ట్వేర్ హబ్‌లా ఉండే ఆ నగరం ఇప్పుడు నీటిలో నానుతోంది. అక్కడి చాలా రోడ్లపై ఇలాగే పీకల్లోతు నీరు నిలిచిపోయింది (water logging). దాంతో ఈ నీటిలోంచి వెళ్లే కార్లు (cars) పూర్తిగా మునిగిపోతున్నాయి. (image credit - twitter - ANI)
గత 24 గంటల్లో హర్యానాలో 64.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణంగా 10 మిల్లీమీటర్లు కురిస్తేనే రోడ్లు చెరువులవుతాయి (Floods). మరి ఈ స్థాయిలో అక్కడ కురవడంతో... ఆ నీరంతా ఎటూ వెళ్లక... రోడ్లు కనిపించట్లేదు. వాహనదారులు నరకం చూస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు హర్యానాలో పిడుగులతో (thunderstorm) కూడిన వర్షం కురుస్తుంది అని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. జనరల్‌గా ముంబైలో ఇలాంటి వరదలు వస్తాయి. ఇప్పుడు హర్యానాకి ఇలా అవుతోంది. (image credit - twitter - ANI)
ఇంత వర్షంలోనూ హర్యానా ప్రజలకు ఓ విషయంలో ఉపశమనం కలుగుతోంది. కొన్ని రోజులుగా హర్యానా ఎండలతో మండిపోతోంది. ఆగస్ట్ 23 నుంచి ఎండలు భగ్గుమంటున్నాయి. వానాకాలంలో ఈ ఎండలేంటని ప్రజలు షాక్ అయ్యారు. భారీగా వర్షాలు పడితే బాగుండు అనుకున్నారు. అదే జరుగుతోంది. ఈ వానల వల్ల పగటివేళ ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. (image credit - twitter - ANI)