మనం సాధారణంగా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎదుటివారిని లోకేషన్ షేర్ చేయమని చెప్తుంటాం. చాలా సార్లు.. అవతలివారు పంపిన అడ్రస్ ను ట్రేస్ చేసుకుంటు వెళ్తే, కరెక్టు అడ్రస్ కు వెళ్తాము. అయితే.. మరికొన్ని సార్లు మాత్రం.. కేవలం అడ్రస్ ను గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసి దగ్గర రూట్ లో వెళ్లడానికి ట్రై చేస్తుంటాం.
హర్యానాలోని సోనేపట్‌లో గూగుల్ మ్యాప్ కారణంగా వందలాది మంది ప్రయాణికుల జీవితాలు అతలాకుతలం అయ్యాయి.రైల్వే ట్రాక్ దాటుతుండగా ఓ వ్యక్తి బైక్‌ను రైల్వే ట్రాక్‌పై వదిలేశాడు. ఈ క్రమంలో అతని ద్విచక్రవాహనం రైల్వే లైన్లో ఇరుక్కుపోయింది. నుంచి పానిపట్ వెళ్తున్న భటిండా ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో మోటార్‌సైకిల్ ఇరుక్కుపోయింది.
అదే సమయంలో గన్నూర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఇరుక్కుపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం జీఆర్పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మోటార్‌సైకిల్‌ను బయటకు తీసి రైలును ప్రారంభించారు. బైక్ రైడర్‌పై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
స్థానికంగా ఉండే.. జింద్ నివాసి నవీన్ అనే వ్యక్తి రాయ్ నుండి జింద్‌కు వెళ్లాలని, గూగుల్ మ్యాప్ ద్వారా గన్నౌర్ చేరుకున్నాడు.
నవీన్ రైల్వే ఫ్లై ఓవర్ మార్గంలో కాకుండా, రైల్వే ట్రాక్ క్రాస్ ద్వారా క్రాసింగ్ చేశాడు. అదే సమయంలో అవతలివైపు నుంచి వస్తున్న భటిండా ఎక్స్‌ప్రెస్ కింద రైల్వే ట్రాక్‌పై రావడంతో అతని బైక్ ఇరుక్కుపోయింది. వెంటనే రైల్వే సిబ్బంది రైలును నిలిపివేశారు. దీని వల్ల గన్నౌర్ స్టేషన్ సమీపంలో పెద్ద రైలు ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే జీఆర్పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మోటార్‌సైకిల్‌ను ఇంజిన్‌లో నుంచి తొలగించి రైలును ప్రారంభించారు.
దాదాపు 20 నిమిషాల పాటు రైలు రైల్వే స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. నవీన్ అనే వ్యక్తి గూగుల్ మ్యాప్ ద్వారా గనౌర్ చేరుకున్నాడని, రైల్వే ట్రాక్ దాటుతుండగా, అవతలి వైపు నుంచి వస్తున్న భటిండా ఎక్స్‌ప్రెస్ కింద అతని బైక్ ఇరుక్కుపోయిందని సోనెపట్ ఆర్పిఎఫ్ ఇంచార్జి యుధ్వీర్ సింగ్ చెప్పారు. అనంతరం రైలును ఇంజిన్ కింద నుంచి బయటకు తీసి ప్రారంభించారు. అదే బైక్ వల్ల పెను ప్రమాదం తప్పింది. నిందితుడు నవీన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.