కొన్ని టీకాలలో ప్రాథమిక మోతాదు తర్వాత బూస్టర్ షాట్లు ఇవ్వబడతాయి. ప్రాథమిక మోతాదు ఆ వైరస్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను గుర్తించి ఉత్పత్తి చేయడానికి రోగనిరోధక వ్యవస్థను సిద్ధం చేస్తుంది. అయితే బూస్టర్ డోస్ ఆ వైరస్‌కు వ్యతిరేకంగా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. కోవిడ్ బూస్టర్ డోస్ వృద్ధులకు లేదా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి చాలా సహాయకారిగా ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
బూస్టర్ డోస్ కోసం Co-WIN పోర్టల్‌లో బూస్టర్ డోస్ కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని కనుగొనాలి. సమీప టీకా కేంద్రాన్ని కనుగొనడానికి క్రిందికి స్క్రోల్ చేయాలి. మీ జిల్లా, పిన్ కోడ్ లేదా మ్యాప్ ద్వారా కూడా ఆరోగ్య కేంద్రం కోసం శోధించవచ్చు. మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుండి ఆరోగ్య కేంద్రాన్ని కూడా కనుగొనవచ్చు(ప్రతీకాత్మక చిత్రం)
ఆపై రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌తో లాగిన్ కావాలి. హోమ్‌పేజీలో సైన్ ఇన్ బటన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ని టైప్ చేయాలి. ఆపై మీ ఫోన్ నంబర్లో వచ్చిన OTPని టైప్ చేయాలి. కొత్త విండోలో, 'షెడ్యూల్ అపాయింట్మెంట్' బటన్‌పై క్లిక్ చేయాలి. కొత్త విండోలో మీ సౌలభ్యం ప్రకారం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు(ప్రతీకాత్మక చిత్రం)