సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో డెల్డా ప్లస్ వేరియంట్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
డెల్టా ప్లస్ వేరియంట్ దేశంలోని 12 రాష్ట్రాలకు పాకింది. దీంతో కేసుల సంఖ్య 51కు చేరింది. ఇందులో అత్యధిక కేసులు మహారాష్ట్రలో 22 నమోదయ్యాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
ఏపీ, ఒడిశా, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, హర్యానా, కర్నాటక రాష్ట్రాల్లో నిన్నటి వరకు ఒక్కో కేసు నమోదైందని కేంద్రం తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
దీంతో మళ్లీ పలు రాష్ట్రాల్లో మళ్లీ లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరగడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
లాక్ డౌన్ సడలింపుల కోసం రూపొందించిన ఐదు దశల్లో మొదటి మూడు దశలను రద్దు చేశారు. రాష్ట్రంలో సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతులు ఇచ్చారు అధికారులు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
సాయంత్రం నాలుగు గంటల అనంతరం రాష్ట్రంలో కర్ఫ్యూను అమలు చేయనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
ఈ కొత్త నిబంధనలను రేపటి నుంచి అంటే జూన్ 28 సోమవారం నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
శని, ఆదివారాల్లో నిత్యావసరాలకు సంబంధించిన షాపులు తప్పా.. మిగతా అన్ని దుకాణాలను మూసి వేయనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
ఈ నిబంధనలు మరో 15 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అనంతరం పరిస్థితుల ఆధారంగా మళ్లీ నిబంధనలను మార్చనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)