Sankranthi Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మార్చి వరకు ఆ ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే
Sankranthi Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మార్చి వరకు ఆ ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే
Indian Railways: సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే ప్రత్యేక ట్రైన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లోని పలు రూట్లలో ఆ ప్రత్యేక రైళ్లను మార్చి 31 వరకు పొడిగిస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే(South Central Railway) నిర్ణయం తీసుకుంది. ఆ రైళ్ల వివరాలివే..
కరోనా నేపథ్యంలో ప్రభత్వం విధించిన లాక్ డౌన్ సమయంలో పూర్తిగా బంద్ అయిన రైళ్లు అన్ లాక్ అనంతరం ఇప్పుడిప్పుడే పాక్షికంగా నడుస్తున్నాయి. అయితే ప్రస్తుతం నడిచే కొద్ది పాటి రైళ్లు ప్రజల ప్రయాణ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేకపోతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ క్రమంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే ప్రత్యేక ట్రైన్లను ప్రకటించి ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే మరో శుభవార్త తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వివిధ రూట్లలో ప్రస్తుతం నడుస్తున్న 30 స్పెషల్ రైళ్లను మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
రైల్వే తాజా నిర్ణయంతో కాకినాడ-లింగంపల్లి, నర్సాపూర్-లింగంపల్లి, తిరుపతి-లింగంపల్లి, హైదరాబాద్-తిరువనంతపురం, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్, హైదరాబాద్-జైపూర్ రైళ్లు మార్చి నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. వీటితో పాటుగా..
5/ 6
హైదరాబాద్-రెక్సాల్, కాచిగూడ-మైసూర్, హైదరాబాద్-ఔరంగాబాద్, హైదరాబాద్-తాంబరం, సికింద్రాబాద్-రాజ్కోట్ తదితర మార్గాల్లో నడుస్తోన్న ప్రత్యేక రైళ్లు సైతం మార్చి నెలాఖరు వరకు కొనసాగనున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఈ ట్రైన్లతో పాటు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జనవరి 8-17 వరకు కాకినాడ టౌన్-తిరుపతి, జనవరి 8-20 వరకు సికింద్రాబాద్-కాకినాడ మార్గాల్లోనూ పలు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ విషయాలను ప్రయాణికులు గమనించాలని రైల్వే సూచించింది.(ప్రతీకాత్మక చిత్రం)