శిర్డీ గ్రామస్తులు మరియు సాయిబాబా సంస్థాన్ నిర్వాహకుల మధ్య జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాబా సమాధి ముందున్న అద్దాలు, మెష్ తొలగించడంతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ద్వారకామయి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. సాయి హరతి జరుగుతున్నప్పుడు భక్తులు గురుస్థాన్ ఆలయంలో ప్రదక్షిణలు చేయవచ్చు.
దీపావళి సెలవుల్లో షిర్డీ సాయిబాబా ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. అక్టోబరు 20 నుంచి నవంబర్ 5 వరకు 15 రోజుల పాటు భక్తులు రూ.18 కోట్ల విరాళాలను సమర్పించారు. హుండీలో రూ.3 కోట్లు, డొనేషన్ కౌంటర్లలో రూ.7 కోట్లు, ఆన్లైన్ డొనేషన్ల ద్వారా రూ.1.50 కోట్లు, చెక్/డీడీ ద్వారా రూ.3 కోట్లు, మనీ ఆర్డర్ ద్వారా రూ.7 లక్షలు వచ్చాయి. ఇవి కాకుండా కొందరు బంగారం, వెండి ఆభరణాలను కూడా సమర్పించారు.