GOOD NEWS TO FARMERS AHEAD OF UP POLLS YOGI ADITYANATH SLASHES POWER RATES FOR AGRICULTURE SK
Good News: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. సగానికి సగం తగ్గింపు..
UP electricity Charges for agriculture: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూపీ ప్రజలపై వరాల జల్లు కురుస్తోంది. తాజా రైతులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ శుభవార్త చెప్పారు. వ్యవసాయ విద్యుత్ చార్జీల ధరలను సగానికి సగం తగ్గించారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
రైతులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయానికి వినియోగించే విద్యుత్ చార్జీలను భారీగా తగ్గించారు. ఏకగా 50శాతం తగ్గించడంతో రైతులు ఊరట లభించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
గ్రామీణ ప్రాంతాల్లో మీటర్ కనెన్షన్ ఉన్న వ్యవసాయ కరెంటు చార్జీలను ఒక యూనిట్‌పై ఒక రూపాయి తగ్గించారు. గతంలో ఇది రూ.2గా ఉండేది. రూ.70గా ఉన్న ఫిక్స్డ్ చార్జీలను ఒక హెచ్పీపై రూ.35కు తగ్గించారు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 6
గ్రామీణ ప్రాంతాల్లో మీటర్ కనెక్షన్ అవసరం లేని వ్యవసాయ కరెంటుకు ఫిక్స్డ్ చార్జీల ధరలను కూడా సగానికి తగ్గించారు. గతంలో రూ.170గా ఉంటే.. ఇప్పుడు ఆ చార్జీని రూ.85కి తగ్గించారు. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 6
గ్రామీణ ప్రాంతాల్లో ఎనర్జీ ఎఫీషెంట్ పంప్‌లకు వినియోగించే కరెంటు చార్జీలను ఒక యూనిట్‌పై 0.83కి తగ్గించారు. గతంలో ఇది రూ.1.65గా ఉండేది. రూ.70గా ఉన్న ఫిక్స్డ్ చార్జీలను ఒక హార్స్పవర్పై రూ.35 తగ్గించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఇక నగరాల్లో మీటర్ కనెక్షన్ ఉన్న వ్యవసాయ కరెంటు చార్జీలను ఒక యూనిట్‌పై రూ.3 తగ్గించారు. గతంలో ఇది రూ.6గా ఉండేది. ఇక రూ.130గా ఉన్న ఫిక్స్డ్ చార్జీలను ఒక హార్స్ పవర్‌పై రూ.65 తగ్గించారు. (ప్రతీకాత్మక చిత్రం)