2. శబరిమలకు అనుమతించే భక్తుల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ సంఖ్యను పెంచాలని శబరిమల అయ్యప్ప సేవా సమాజం కోరుతోంది. రోజూ కనీసం 3,000 మంది అయ్యప్ప భక్తుల్ని, శని,ఆదివారాల్లో 5,000 మంది భక్తుల్ని అనుమతించాలని ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డును ఇటీవల కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. భక్తుల నుంచి వస్తున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు ఆలయంలోకి అనుమతించే భక్తుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజూ 1,000 మంది భక్తుల స్థానంలో 2,000 మంది భక్తుల్ని, వారాంతంలో, సెలవుల్లో 2,000 మంది బదులు 3,000 మంది భక్తుల్ని అనుమతించనున్నట్టు తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. శబరిమల వెళ్లే భక్తులు https://sabarimalaonline.org/ వర్చువల్ క్యూ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. శబరిమల వెళ్లాలనుకునే భక్తులు వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి. టికెట్లు బుక్ చేసుకున్న భక్తులనే శబరిమల వెళ్లేందుకు అనుమతిస్తారు. బుకింగ్ చేసిన టికెట్లతో పాటు కోవిడ్ 19 నెగిటీవ్ సర్టిఫికెట్ తప్పనిసరి. 10 ఏళ్ల లోపు, 60 ఏళ్లు దాటినవారికి అనుమతి లేదు. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దర్శనానికి అప్లై చేయకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
5. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు కావాల్సిన చర్యల్ని తీసుకుంది ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డ్. భక్తులు పాటించాల్సిన కోవిడ్ 19 గైడ్‌లైన్స్ కూడా ప్రకటించింది. భక్తులు తప్పనిసరిగా కోవిడ్ 19 నెగిటీవ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. అది కూడా గత 24గంటల్లో తీసుకున్న సర్టిఫికెట్ అయి ఉండాలి. మెడికల్ ఇన్స్యూరెన్స్ కార్డు తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
7. పంబలో లేదా సన్నిధానంలో భక్తులు బస చేసేందుకు అనుమతి లేదు. నీలక్కల్ దగ్గర పరిమితంగా బస ఏర్పాట్లు ఉంటాయి. స్వామి అయ్యప్పన్ రోడ్డు ద్వారానే ట్రెక్కింగ్‌కు అనుమతి ఉంది. సన్నిధానం దగ్గర నెయ్యాభిషేకం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయి. భక్తులను పంబకు తీసుకెళ్లి తిరిగి నీలక్కల్‌కు తీసుకొచ్చేందుకు లైట్ మోటార్ వెహికిల్స్ అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)