GaneshChaturthi: ఘనంగా మొదలైన వినాయక చవితి వేడుకలు.. ఖైరతాబాద్‌లో పూజ ఎన్ని గంటలకు అంటే..

దేశవ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణేష్ చతుర్థిని పురస్కరించుకుని వినాయక స్వామి ఆలయాల్లో తెల్లవారుజామునే పూజలు మొదలయ్యాయి. ఉదయం నుంచే ఆ లంబోదరుడిని దర్శించుకునేందుకు పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు.