Ganesh Chaturthi 2020: వినాయకుడి జన్మ వృత్తాంతం... చూసి తరించండి
Ganesh Chaturthi 2020: వినాయకుడి జన్మ వృత్తాంతం... చూసి తరించండి
Ganesh Chaturthi 2020: బొజ్జ గణపయ్య ఎలా పుట్టాడు? ఆయనకు ఏనుగు తొండం ఎలా వచ్చింది? ఆ కథను గ్రాఫిక్స్ ద్వారా తెలుసుకుందాం.
1/ 15
అనగనగా ఓ రోజు... చెడుపై యుద్ధం చేయడానికి పరమేశ్వరుడు బయటకు వెళ్లాడు. కైలాస పర్వతంపై ఉన్న ఇంట్లో పార్వతీదేవి ఒక్కత్తే ఉంది.
2/ 15
పార్వతీ దేవి స్నానానికి వెళ్లాలని అనుకుంది. ఆ సమయంలో ఇంటిని కాపలా కాచేందుకు ఎవరూ లేరు. దాంతో ఆమె తన శరీరం నుంచీ ఓ పసుపు ముద్దను తీసి... దానితో చిట్టి వినాయకుడి రూపాన్ని తయారుచేసింది.
3/ 15
ఆ చిట్టి రూపానికి ఆమె ఊపిరి పోసింది. అలా చిట్టి గణేశుడు జన్మించాడు.
4/ 15
పార్వతీ దేవి స్నానానికి వెళ్తూ... లోపలికి ఎవరినీ రానివ్వవద్దని చిట్టి గణపతికి చెబుతుంది. సరేనన్న గణపతి... ద్వారం దగ్గర కాపలా ఉంటాడు.
5/ 15
యుద్ధం ముగిసిన తర్వాత పరమశివుడు కైలాసంలోని తన ఇంటికి వస్తాడు.
6/ 15
అక్కడ చిట్టి గణపతిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు. త్రినేత్రుణ్ని ఇంట్లోకి వెళ్లనివ్వకుండా ఆ చిట్టి గణపతి అడ్డుకుంటాడు.
7/ 15
ఆగ్రహించిన శివుడు... చిట్టి గణపతిని చంపేయమని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు.
8/ 15
కానీ గణేశుడు ఆ సైన్యాన్ని బలంగా తిప్పికొడతాడు.
9/ 15
మరింత ఆగ్రహించిన శివుడు... తానే గణపతిని అంతమొందించాలని అనుకుంటాడు. తన త్రిశూలంతో ఒకే ఒక్క దెబ్బకు గణేశుడి తలను తెగ్గొడతాడు. దాంతో చిట్టి గణపతి అక్కడికక్కడ చనిపోతాడు.
10/ 15
ఈ విషయం తెలిసిన పార్వతీదేవి ఆశ్చర్యపోతుంది. ఆగ్రహంతో ఊగిపోతుంది. తన అవతారాలన్నింటినీ అక్కడకు రావాల్సిందిగా ఆదేశిస్తుంది. ముల్లోకాలనూ అంతం చేస్తానని ప్రకటిస్తుంది.
11/ 15
విషయం తెలుసుకున్న శివుడు... ఆమెను ఓదార్చి... శరణు వేడుకుంటాడు.
12/ 15
అప్పుడు పార్వతి రెండు కండీషన్లు పెడుతుంది. గణేశుడు తిరిగి ప్రాణాలతో బతకాలనీ, ఎప్పుడు ఏ పూజలు జరిగినా ముందుగా వినాయకుడికే పూజ చెయ్యాలని కోరుతుంది.
13/ 15
శివుడు బ్రహ్మను కలిసి... ఉత్తరంవైపున తలపెట్టి నిద్రపోతున్న మొదటి జీవి తలను కట్ చేసి తీసుకురమ్మని ఆదేశిస్తాడు.
14/ 15
అలా వెళ్లిన బ్రహ్మ... నిద్రపోతున్న ఏనుగు తలను కట్ చేసి... తీసుకొస్తాడు. ఆ తలను శివుడు... గణేశుడి తలకు అమర్చుతాడు.
15/ 15
తిరిగి జన్మించిన వినాయకుణ్ని... శివుడు తన కొడుకుగా ప్రకటిస్తాడు. అలా ఏనుగు తలతో విఘ్నేశ్వరుడు అవతరించాడు. విఘ్నాధిపతిగా పూజలు అందుకుంటున్నాడు.