ముంబైలో నివసించేవారికి లివింగ్ లిక్విడ్జ్ (Living Liquidz) వెబ్సైట్ https://livingliquidz.com మద్యాన్ని హోమ్ డెలివరీ చేస్తోంది. ఈ వెబ్సైట్ బీర్, టేకిలా, విస్కీ వంటి టేస్టీ లిక్కర్లన్నీ ఇంటి వద్దకే వచ్చి మరీ ఇస్తుంది. అత్యంత విశ్వసనీయ ఆన్లైన్లో ఆల్కహాల్ డెలివరీ పోర్టల్లలో లివింగ్ లిక్విడ్జ్ ఒకటిగా నిలిచింది. ఈ వెబ్సైట్ దేశవ్యాప్తంగా అనేక లొకేషన్లలో తన డెలివరీ సేవలు అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి వీటి సేవలు ముంబైలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
తేకా సర్వీస్ (Theka Service) వెబ్సైట్ https://thekaservice.com/ ఓఎల్ఎక్స్ లాగా పనిచేస్తుంది. అంటే ఓపెన్ చేయని లిక్కర్ బాటిల్స్‌ను విక్రయించేందుకు ప్రజలు ఈ వెబ్సైట్లో వాటి వివరాలు అప్లోడ్ చేస్తారు. వాటిలో నచ్చిన బాటిల్‌ను బుక్ చేసుకుంటే ఇంటికి తెచ్చి ఇస్తారు లేదా సమీపంలోని అడ్రస్‌కి వెళ్లి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇందులో సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది. మనదేశంలో దొరకని విదేశీ మద్యం లేదా అరుదైన డ్రింక్స్ కొనాలనుకునే వారికి ఈ వెబ్సైట్ బెస్ట్‌గా నిలుస్తుంది.
వైన్ వెల్ (WineWell) వెబ్సైట్ https://www.winewell.in/ కూడా బీర్లతో పాటు అనేక రకాల లిక్కర్ ప్రొడక్ట్స్ ముంబైలో నివసించే వారికి డెలివరీ చేస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ సైట్ వారు ఆన్లైన్ డెలివరీని తాత్కాలికంగా నిలిపివేశారు. అయినా కూడా మీరు వారికి కాల్ చేస్తే, వారు మీకు కావలసిన ఆల్కహాల్ డ్రింక్‌ను మీ ఇంటికే నేరుగా వచ్చి డెలివరీ చేస్తారు.