Tamilnadu Elections: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఈ సినీ నటిని గుర్తుపట్టారా..!
Tamilnadu Elections: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఈ సినీ నటిని గుర్తుపట్టారా..!
మదురై పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ శాసనసభ్యుడు డాక్టర్ శరవణన్‌కు మద్దతుగా ఆమె ప్రచారం చేసింది. ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ నమిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యేడాదికి ఆరు సిలిండర్లు, ఉచిత కేబుల్ కనెక్షన్, వాషింగ్ మిషన్ కావాలంటే బీజేపీ బలపరిచిన అన్నాడీఎంకే అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆమె ఓటర్లుకు పిలుపునిచ్చింది.
హీరోయిన్ నమిత గుర్తుందా. తెలుగులో ‘సొంతం’, ‘జెమినీ’, ‘బిల్లా’ సినిమాలతో ప్రేక్షకులకు సుపరితురాలైన నమిత ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరపున ప్రచారం చేస్తోంది.
2/ 5
మదురై పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ శాసనసభ్యుడు డాక్టర్ శరవణన్‌కు మద్దతుగా ఆమె ప్రచారం చేసింది.
3/ 5
ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ నమిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యేడాదికి ఆరు సిలిండర్లు, ఉచిత కేబుల్ కనెక్షన్, వాషింగ్ మిషన్ కావాలంటే బీజేపీ బలపరిచిన అన్నాడీఎంకే అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆమె ఓటర్లుకు పిలుపునిచ్చింది.
4/ 5
అంతేకాదు, ఉచిత సిలిండర్లు పొందితే ఇష్టమొచ్చినప్పుడు తమకు నచ్చిన బిర్యానీ చేసుకుని తినవచ్చని.. తాను శాకాహారినని.. వెజ్ బిర్యానీని వండిపెడితే తినడానికి వస్తానని ఓటర్లను ఆకట్టుకునే విధంగా నమిత మాట్లాడింది.
5/ 5
ఆమె ఆ మాట అనగానే.. యువకులంతా ‘సై.. సై’ అంటూ కేకలేయడం కొసమెరుపు. తమిళనాడులో నమితకు కుర్రకారులో మంచి క్రేజే ఉంది. ఆమెకు గుడి కూడా కట్టారంటే బొద్దు గుమ్మలను తమిళ యువత ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.