FEVER AFTER VACCINATION NO PROBLEM CHRONIC PATIENT ALSO USE REGULAR MEDICINES VB
Corona Vaccination: టీకా తీసుకున్న తర్వాత జ్వరం, ఒళ్లునొప్పులు వస్తున్నాయా.. వాటి వల్ల ఏమైనా ప్రమాదం ఉందా.. తెలుసుకోండి..
Corona Vaccination: వ్యాక్సిన్ తీసుకున్నాక ఏమైనా అలవాట్లను మార్చుకోవాలా.. ఏదైనా దార్ఘకాలిక వ్యాధి ఉంటే దానికి సంబంధించిన మందులను వేసుకోవచ్చా.. అనే సందేహాలు వస్తుంటాయి. చాలా మంది వీటికి భయపడి కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు..
వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కేన్సర్, లేదా మరేదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు రెగ్యులర్ మందులను తప్పకుండా తీసుకోవాలని వైద్యుల సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఇలా మందులు వాడకంపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. టాకా తీసుకున్న తర్వాత చాలామందికి జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
ఇలా డాక్టర్లకు కూడా వస్తున్నట్లు తెలిపారు. కొందరికైతే మూడు రోజుల వరకు కూడా జ్వరం తగ్గడం లేదని చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
దీనికి భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. దీనికి పారాసిటమాల్, పెయిన్ కిల్లర్ వంటి మందులను వేసుకుంటే సరిపోతుందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ఈ మందులు వాడడం వల్ల ప్రయోజనమే తప్ప ప్రమాదమేమీ లేదని యశోద ఆసుపత్రి కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్, కోరుకొండ సౌమ్య తెలియజేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
టీకా తీసుకునేవాళ్లలో మినహాయింపు ఉంది. కేన్సర్ రోగుల్లో కీమో, ఆపరేషన్ వంటి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వాళ్లు , తీవ్రమైన గుండె జబ్బులున్నవారు, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలున్న టీకా తీసుకోకుడదని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి టీకా ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆమె తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన కరోనా వైరస్ శరీరంలో ప్రవేశించదని అనుకోవడం పోరపాటు. ఎప్పటిలాగానే చేతులను శుభ్రంగా కడుక్కొని శానిటైజ్ చేసుకోవాలన్నారు. భౌతికదూరం పాటిస్తూ కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)