UDISE+, విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇది దేశంలో పాఠశాల విద్య డేటా యొక్క బహిరంగంగా నిర్వహించబడే ఏకైక రిపోజిటరీ. ఈ నివేదిక ప్రకారం దేశంలో ప్రైమరీ పైన ఉన్న అన్ని స్థాయిలలో, అంటే, అప్పర్ ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీలో, పాఠశాలల్లో నమోదు పిల్లల సంఖ్య పెరిగింది. ఇది మంచి పరిణామమని నివేదిక పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
UDISE+ చేసిన సర్వేలో 11 నుంచి 12 వరకు ఉన్న హయ్యర్ సెకండరీ తరగతుల్లో GER 2013-14లో 44.1 శాతం నుంచి 2019-20లో 52.4 శాతానికి రికార్డు స్థాయిలో పెరిగిందని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. నివేదిక ప్రకారం, 2019-20లో, ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు బాలికల నమోదు 12.08 కోట్లకు పైగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)