వ్యవసాయం కోసం 3 లక్షల రూపాయల వరకు స్వల్పకాలిక రుణాలపై 1.5 శాతం వడ్డీ రాయితీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీని కింద రూ.3 లక్షల వరకు రుణాలు తీసుకునే రైతులకు వడ్డీలో 1.5 శాతం రాయితీ లభిస్తుంది. వ్యవసాయ రంగంలో తగిన రుణం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇది కాకుండా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ పరిమితిని ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లకు పెంచింది.(ఫ్రతీకాత్మక చిత్రం)
ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్ జీఎస్) కింద ప్రభుత్వం మరో రూ.50,000 కోట్ల వ్యయాన్ని పెంచింది. ఇప్పుడు ఈ పథకం కింద మొత్తం క్రెడిట్ పరిమితి రూ. 5 లక్షల కోట్లకు పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇది హోటళ్లు, సంబంధిత రంగాలకు ఊతం ఇస్తుంది.(ఫ్రతీకాత్మక చిత్రం)