కేంద్రంలోని మోదీ సర్కార్ రైతుల కోసం పలు ప్రతిష్టాత్మక పథకాలు అమలు చేస్తున్నది. అందులో బాగా ప్రాచుర్యం పొందింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) కాగా, ఆ పథకం నుంచి సులువుగా చేరిపోగల ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ (పీఎం ఎస్వైఎం) కూడా రైతులకు ఎంతో ఉపయోగకరమైనది. (ప్రతీకాత్మక చిత్రం)
రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000 నగదును నేరుగా ఖాతాల్లోకి పంపుతోన్న పథకం పీఎం కిసాన్. ఈ పథకంలోని లబ్దిదారులు తమ ఫోన్ల ద్వారానో హెల్ప్ లైన్ల ద్వారానో ఇప్పటికే వివరాలను ఈ-కేవైసీ రూపంలో పొందుపర్చి ఉంటారు. కాబట్టి నెలకు రూ.3000 పొందే పెన్షన్ పథకానికి కొత్తగా పత్రాలేవీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన (పీఎం ఎస్వైఎం) పథకం కింద అర్హత కలిగిన రైతులు అందరికీ ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్ వస్తుంది. అయితే ఈ డబ్బులు 60 ఏళ్లు వచ్చిన దగ్గరి నుంచి లభిస్తాయి. దీని వల్ల కార్మికులకు వయసు మల్లిన తర్వాత ఆర్థిక భద్రత లభిస్తుందని చెప్పుకోవచ్చు. డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లలోనే జమ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ వార్తలు, పీఎం కిసాన్ స్కీమ్, యూనిక్ ఐడీ, రైతులకు స్కీమ్స్" width="1200" height="800" /> రైతులకు పెన్షన్ పథకంలో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసున్నవారు ఎవరైనా చేరొచ్చు. నెలకు కనీసం రూ.55 నుంచి రూ.200 (40 ఏళ్ల వారైతే నెలకు రూ.200 చెల్లించాలి) కట్టుకుంటూ పోతే, ఇంతే మొత్తంలో ప్రభుత్వం సైతం డబ్బును జమచేస్తూ ఉంటుంది. నెలకు రూ.15 వేల వరకు ఆదాయం పొందే రైతు కూలీలు కూడా ఈ పథకంలో చేరొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆధార్ నెంబర్ లింకింగ్, పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్, పీఎం కిసాన్ యోజన పథకం, పీఎం కిసాన్ స్టేటస్ చెక్ ఆధార్ కార్డు" width="1600" height="1600" /> కామన్ సర్వీస్ సెంటర్లలో అవసరమైన డాక్యుమెంట్లు అందించి రైతులకు పెన్షన్ పథకంలో చేరొచ్చు. లేదంటే శ్రమ యోగి మాన్ ధన్ వెబ్సైట్ https://maandhan.in/shramyogi లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ నెంబర్ ఉంటే ఈ పని పూర్తి చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)