Lockdown: దేశమంతటా 2 నెలల పాటు సంపూర్ణ లాక్‌డౌన్.. కేంద్రానికి ఐసీఎంఆర్ సూచన

India Lockdown: ప్రస్తుతం మనదేశం మళ్లీ లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. నేషనల్ లాక్‌డౌన్ ప్రకటించనప్పటికీ.. అని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్ లేదా పాక్షిక లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. అంతటా కఠినమైన కోవిడ్ నిబంధనలు అమలవుతున్నాయి. ఈ క్రమంలో భారత వైద్య పరిశోధనా మండలి కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 2 నెలల పాటు లాక్‌డౌన్ విధించాలని స్పష్టం చేసింది.