ప్రపంచం మొత్తం మారినా మందుబాబుల తీరు మాత్రం మారదు..! పీకల వరకు తాగడం.. తాగి తూలడం.. అదే మైకంలో బండి నడపడం.. యాక్సిడెంట్ చేయడం.. అమాయకుల ప్రాణాల తీయడం..ఇదంతా వారికి సోడాతో పెట్టిన ..! పోలీసులు ఎన్ని కఠిన రూల్స్ తీసుకొచ్చినా.. మా పని మాదే.. మా తాగుడు మాదే.. మా డ్రైవింగ్ మాదే అన్నట్లుంటుంది వారి నైజం..!
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎన్నిసార్లు పట్టుపడినా వారి తీరులో ఏ మాత్రం మార్పు ఉండడంలేదు. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై నగరాల్లో మందుబాబుల డ్రంక్ అండ్ డ్రైవ్ హత్యలు అనేకం..! మన హైదరాబాదీ పోలీసులు ఎప్పటికప్పుడు చెకింగ్స్ చేస్తూ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ మందుబాబుల ఆట కట్టిస్తుంటారు. అటు చెన్నై పోలీసులు కూడా రూట్ మార్చారు...
ఇక కాల్ సెంటర్ల ద్వారా పెండింగ్ లో ఉన్న కేసులపై ఫోకస్ పెంచారు పోలీసులు. ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఫైన్ కట్టని వారికి కాల్ సెంటర్ల ద్వారా సమాచారం అందిస్తున్నారు. అయినా కూడా మందుబాబులు ఫైన్ కట్టడంలేదని తెలుస్తోంది. ఇక ఇలాంటి స్పెషల్ డ్రైవ్‌లు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
అటు ఫైన్‌కు సంబంధించిన అంశాలను కూడా ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తున్నారు పోలీసులు. మొత్తం 8,912 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పరిష్కారానికి పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. ఈ-కోర్టుల నుంచి సంబంధిత వ్యక్తి మొబైల్‌కు సమాచారం ఇచ్చినప్పటికీ జరిమానా చెల్లించడానికి చాలా మంది ముందుకు రావడం లేదని సమాచారం. మరి చూడాలి పోలీసులు ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తారో..!