సిద్ధి వినాయకుని సేవలో దేవేంద్ర ఫడ్నవిస్..మొక్కులు చెల్లింపు

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి ఏకంగా 41 స్థానాలను దక్కించుకుంది. బీజేపీ 23 స్థానాలు, శివసేన 18 స్థానాల్లో గెలుచుకున్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి కేవలం 5 స్థానాలకు పరిమితంకాగా...ఇతరులు మరో రెండు స్థానాల్లో విజయం సాధించారు.