DRONE DROPS BOMBS NEAR INDIA PAKISTAN IN AMRITSAR PUNJAB FLEES TO PAKISTAN AFTER BSF OPENS FIRE MKS
Pakistan Drone: అమృత్‌సర్‌లో డ్రోన్ బాంబు దాడి...తిప్పికొట్టిన బీఎస్ఎఫ్ -Punjab ఎన్నికల వేళ!
భారత్, పాకిస్తాన్ మధ్య ఏడాదికిపైగా కాల్పుల విరమణ ఒప్పందం కచ్చితంగా అమలవుతున్నది. ఇరువైపుల సైన్యాల నుంచి తూటాలేవీ పేలడంలేదు. కానీ పాకిస్తాన్ లోని అదృశ్యశక్తులు మాత్రం భారత్ పై దాడికి యత్నిస్తూనే ఉన్నాయి. తాజాగా అమృత్‌సర్‌లో డ్రోన్ బాంబు దాడి జరిగింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఘటన కలకలం రేపుతున్నది. వివరాలివే..
భారత్, పాకిస్తాన్ సరిహద్దులో కొంతకాలంగా నెలకొన్న శాంతిని భంగపరుస్తూ అనూహ్య సంఘటన ఒకటి మంగళవారం జరిగింది. దేశ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ జరిపిన దాడిని బీఎస్ఎఫ్ జవాన్లు తిప్పికొట్టారు.
2/ 7
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో అజ్నాలా తెహసిల్‌లోని పంజ్‌గ్రాహియన్ సరిహద్దు ఔట్‌పోస్ట్ వద్ద మంగళవారం అర్థరాత్రి డ్రోన్ పేలుడు పదార్థాలను వదిలింది. డ్రోన్ కదలికలను గుర్తించిన జవాన్లు కాల్పులు జరిపారు.
3/ 7
బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరపడంతో ఆ డ్రోన్ తిరిగి పాకిస్తాన్ వైపు ఎగిరిపోయింది. సంఘటన జరిగిన వెంటనే బీఎస్ఎఫ్ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
4/ 7
రెండు ప్రదేశాలలో పేలుడు పదార్థాలను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. భారత్‌కు పేలుడు పదార్థాలు, ఆయుధాలు, నగదు, డ్రగ్స్‌ను పంపేందుకు సరిహద్దుల్లోని ఉగ్రవాద సంస్థలు ఇటీవల డ్రోన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.
5/ 7
పాకిస్తాన్ నుంచి డ్రోన్ల రాక పెరిగిన క్రమంలో భద్రతా బలగాలు అప్రమత్తమై దేశ సరిహద్దుల వెంబడి డ్రోన్ వ్యతిరేక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. తాజా ఘటన అమృత్ సర్ జిల్లా రామ్‌దాస్ పీఎస్ పరిధిలోని BOP పంజ్ గ్రాహియా సమీపంలో చోటుచేసుకుంది.
6/ 7
సోదాలలో అనుమానిత పేలుడు పదార్థాలున్న రెండు పసుపు రంగు ప్యాకెట్లను బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్యాకెట్లో పిస్టల్ కూడా చుట్టి ఉందని, కంచెకు 2.7 కిలోమీటర్ల దూరంలోని పొలంలో ఈ వస్తువులను గుర్తించామని అధికారులు తెలిపారు.
7/ 7
కాగా, బీఎస్ఎఫ్ జవాన్ల కాల్పుల తర్వాత పాక్ వైపు ఎగిరిపోయిన డ్రోన్ పడిపోయిందా లేక అదృశ్యమైందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు బలగాలు ప్రయత్నిస్తున్నాయి. లో పాకిస్తాన్ సరిహద్దులో గతంలోనూ పలు డ్రోన్లను మనవాళ్లు నేలకూల్చారు. (ప్రతీకాత్మక చిత్రం)