Celebraties Diwali Celbrations: దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు సైతం ఈ వేడుకను ఘనంగానే జరుపుకున్నారు.. కులాలు మతాలకు దేశాలకు, భాషలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా పండుగ సందడే కనిపించింది. అటు అమెరికా అధ్యక్షుడు, ఇటు మన దేశ ప్రధాని.. స్పోర్ట్స్ స్టార్లు.. సినిమా సెలబ్రిటీలు అంతా వేడుకగా పండుగను జరుపుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు..
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆనందంగా దీపావళి వేడుకలను ఘనంగా జరపుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన దీపావళి పండుగను ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకగా చేసుకున్నారు. తన ఇద్దరు కుమారులతో కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులు ఎంత ముద్దుగా ఉన్నారో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక మెగా ఫ్యామిలిలోనూ దీపావళి వేడుకలు అంబరాన్ని అంటాయి.. మెగా ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులంతా ఒకే గూటికి చేరి వేడుకల్లో భాగమయ్యారు. ఇటీవల మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతుంటే.. అల్లూ అర్జున్ మాత్రం దీపావళి రోజు మెగా కుటుంబంతో కలిసి సందడి చేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి కుటుంభ సభ్యులతో కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
నేచురల్ స్టార్ నాని సమయం దొరికితే తన కొడుకుతేనే ఎక్కువగా గుడపుతారు.. ఇక దీపావళి పండుగ అంటే ఇక తనయుడు జున్నూతో చేసే సందడి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.. పండుగ సందర్భంగా కొడుకు జున్నూతో కలిసి దిగిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అభిమానులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు..
ఇటీవల నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్న సాయి పల్లవి కూడా ఫుల్ జోష్ లో కనిపించారు. ఉదయం నుంచి ఆమె ఇంట్లో దీపావాళి సందడి కనిపించింది. సంప్రదాయ బట్టల్లో సాయి పల్లవి కుటుంబ సభ్యులు.. దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆ ఫోటోలను సాయి పల్లవి తమ అభిమానులతో షేర్ చేసుకున్నారు. తనను ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు..
ఇక బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇంట కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె హంగామా చేశారు. చక్కగా ఇంటిని అలంకరించి.. దీపాలు వెలిగిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సర్వసాధరంగా హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో సందడి చేసే అనసూయ.. చాలా సంప్రదాయ బద్ధంగా దీపావళి వేడుకల్లో సందడి చేయడంతో.. ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతన్నారు.