DIWALI 2019 DIWALI CELEBRATIONS INDIA WIDE HOW STATES OF INDIA CELEBRATE DIWALI THIS YEAR NK
Diwali 2019 : దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు... అద్భుత దృశ్యాలు
Diwali 2019 : దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. నిన్న రాత్రి నుంచే దీపావళి మోత మోగుతోంది. ఈ సంవత్సరం ప్రజలు గ్రీన్ దివాలీ జరుపుకోవాలని నిర్ణయించుకోవడంతో... కాలుష్యం తక్కువగా ఉండే బాణసంచా మాత్రమే కాల్చుతున్నారు. పైగా అవి సౌండ్ కూడా పెద్దగా లేవు. ప్రజల ఆలోచనా ధోరణి మారుతోందనేందుకు ఇదో నిదర్శనం. ఐతే... గ్రీన్ క్రేకర్స్ రేటు ఎక్కువగా ఉంటున్నాయి. అదే సంప్రదాయ బాణసంచా అయితే తక్కువ రేటుకే వస్తోంది. అయినప్పటికీ ప్రజలు మాత్రం పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో గ్రీన్ దివాళీకే మొగ్గు చూపుతున్నారు. రేటు ఎక్కువైనా గ్రీన్ క్రేకర్సే కొనుక్కుంటున్నారు. పిల్లలకు అవే ఇచ్చి... ఈ సంవత్సరం ఇలా ఎడ్జస్ట్ అవ్వమని చెబుతున్నారు. మరి దీపావళి సంబరాలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం.