Shirdi Sai Baba: సాయిబాబా భక్తులకు శుభవార్త.. ఎల్లుండి నుంచి షిర్డీలో దర్శనానికి అనుమతి.. రోజుకు ఎంతమందికంటే..
Shirdi Sai Baba: సాయిబాబా భక్తులకు శుభవార్త.. ఎల్లుండి నుంచి షిర్డీలో దర్శనానికి అనుమతి.. రోజుకు ఎంతమందికంటే..
Shirdi Sai Baba: నవరాత్రులు తొలిరోజైన అక్టోబర్ 7 నుంచి షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తులకు అనుమతించాలని సాయిబాబా టెంపులు ట్రస్ట్ నిర్ణయించింది. కొన్ని నిబంధనలను పాటిస్తూ భక్తులు సాయిబాబాను దర్శించుకోవచ్చు.
కరోనా విలయం తరువాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా, ధార్మిక సంస్థలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కరోనా కారణంగా ఏకాంతంగా పూజలు అందుకుంటున్న షిర్డీ సాయిసాథుడు.. త్వరలోనే తన భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
2/ 6
నవరాత్రులు తొలిరోజైన అక్టోబర్ 7 నుంచి షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తులకు అనుమతించాలని సాయిబాబా టెంపులు ట్రస్ట్ నిర్ణయించింది. కొన్ని నిబంధనలను పాటిస్తూ భక్తులు సాయిబాబాను దర్శించుకోవచ్చు.
3/ 6
ఎల్లుండి నుంచి ప్రతిరోజూ 15 వేల మందికి మాత్రమే సాయి దర్శనం లభిస్తుంది. ఇందులో 5 వేల వరకు పెయిడ్ పాసులు, 5 వేల ఆన్లైన్ పాసులు, 5 వేల ఆఫ్ లైన్ పాసులు ఉంటాయి. అంటే గంటకు దాదాపు 1,150 మంది షిర్డీ సాయినాథుడిని దర్శించుకోనున్నారు.
4/ 6
మరోవైపు ఆర్తి సేవకు కేవలం 90 మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. గర్భిణీలు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారిని ఆలయంలోకి అనుమతించరు.
5/ 6
గతేడాది మార్చి 17న కరోనా లాక్డౌన్ కారణంగా మూతబడ్డ సాయిబాబా ఆలయం.. తొమ్మిది నెలల తరువాత నవంబర్ 16న తిరిగి తెరిచారు. అప్పట్లో రోజుకు 6000 మందికి దర్శనం కల్పించారు.
6/ 6
ఆ తరువాత దీన్ని పెంచుతూ 14 వేల నుంచి 20 వేలకు పెంచారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 5 తరువాత కరోనా కేసుల పెరుగుదల కారణంగా సాయిబాబు ఆలయాన్ని మరోసారి మూసేశారు. మళ్లీ దాదాపు ఏడు నెలల తరువాత ఆలయాన్ని తెరిచేందుకు సిద్ధమయ్యారు.